తాను చేసేది ఏమీ లేకపోయినా ఏదో చేస్తున్నట్టుగా కవరింగ్ ఇచ్చుకోవడం మొదటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారింది అనే విమర్శలు ఉన్నాయి. తాను తప్ప ప్రజా సంక్షేమం కోసం మరెవరూ పాటు పడడం లేదు అన్నట్టుగా ఆయన బిల్డప్ ఉంటుంది. తాను ఏమి చెప్పినా తన అనుకూల మీడియా బాగా ప్రచారం చేస్తుందనే నమ్మకంతో చంద్రబాబు తాము అధికారంలో లేకపోయినా ఉన్నట్టుగానే రెచ్చిపోతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు అప్పటి నుంచి రాజధానిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టకపోగా తాత్కాలిక బిల్డింగ్ లతో సరిపెట్టారు. అది కూడా వర్షాలకు స్లాబ్ నుంచి నీరుకారిపోతూ బాబుగారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసింది.


 గ్రాఫిక్స్ లో రాజధాని నమూనాలు చూపిస్తూ రకరకాల విన్యాసాలు చేశారు చంద్రబాబు. ఫలితంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందింది. తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ రేంజిలో ఎప్పుడు దెబ్బ తినలేదు. ఇదంతా బాబు గారి గొప్పతనం అని ఆ పార్టీలోనే సెటైర్లు వినిపించాయి. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఒకే రీతిలో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా చంద్రబాబు రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు సిద్ధమై పోయాడు.


అమరావతి ప్రాంతంలో కొంతమంది టీడీపీ అనుకూల వర్గీయులు చేపడుతున్న దీక్షను వెనకుండి నడిపిస్తూ రాజధాని ప్రాంతంలో మొత్తం రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చంద్రబాబు కలరింగ్ ఇస్తున్నాడు. రైతుల పక్షాన నిలబడతానని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అంటూ హడావుడి చేస్తున్నాడు. అయితే చంద్రబాబు విన్యాసాలు మొదటినుంచి గమనిస్తున్న ప్రజలు ఆయనపై విశ్వాసం ఎప్పుడో కోల్పోయారు. అయినా బాబు గారు మాత్రం హడావుడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబును ప్రజలు మాత్రమే కాకుండా ఇప్పుడు సొంత పార్టీ నాయకులు కూడా నమ్మడమే లేదు. అందుకే వారు టిడిపి కి దూరంగా వైసీపీ కి దగ్గరగా చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం ఏదో హడావుడి చేస్తే తప్ప నాయకులు తమ పార్టీలో ఉండరనే విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే ఈ తాపత్రయం అంతా.

మరింత సమాచారం తెలుసుకోండి: