అవును చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం తెలంగాణా విషయంలో సంచలనమైనదనే చెప్పాలి.  ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పోటి చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు.  అంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మొత్తం ఖాళీయే. అందుకనే ప్రతి శని, ఆదివారాల్లో అమరావతి నుండి విజయవాడకు వచ్చేస్తున్నారు లేండి.

 

ఇలా మొన్న రెండు రోజులు హైదరాబాద్ లో ఉన్నపుడు కొందరు నేతలు వచ్చి కలిశారు. కలిసిన వాళ్ళు ఏదో నమస్కారం పెట్టి వెళ్ళిపోకుండా తొందరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దాంతో రెచ్చిపోయిన చంద్రబాబు జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ పోటి చేస్తుందంటూ ప్రకటించేశారు. పనిలో పనిగా టిడిపి యువనేతలను ప్రోత్సహించబోతున్నట్లు కూడా హామీ ఇచ్చేశారు.

 

ఇంకేముంది టిడిపి ఎన్నికల్లో పోటి చేయబోతున్నట్లు ప్రకటించేయగానే అధికార టిఆర్ఎస్, ప్రధానప్రతిపక్షాలకు కంటిమీద కునుకు కూడా కరువైందట. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే టిడిపి ఎప్పుడెపుడు పోటి చేస్తుందా ? ఎప్పుడెపుడు ఓట్లేసేద్దామా ? అని జనాలు ఎదురు చూస్తున్నట్లుంది. పోయిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలోను  పోటి చేస్తే టిడిపి ఒక్క డివిజన్లో మాత్రమే గెలిచింది. అప్పట్లో బిజెపితో పేరుకు మాత్రమే పొత్తు. అన్నింటిలోను అందరూ పోటి చేశారు.

 

తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటి చేస్తే మూడు చోట్ల మాత్రమే గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క చోట కూడా గెలవలేదు. ఇక ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అసలు పోటినే చేయలేదు.  తెలంగాణాలో టిడిపి పరిస్ధితి ఒట్టిపోయిన ఆవు లాగ తయారైపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు.  దింపుడుకళ్ళెం ఆశలాంటిదేదో చంద్రబాబులో ఉన్నట్లుంది.  ఎందుకంటే ఏదో నోటికొచ్చింది ప్రకటించేశారు. చూద్దాం రాబోయే ఎన్నికల్లో టిడిపి ఏమాత్రం పోటి ఇస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: