అనేక నాటకీయ పరిణామాల మధ్య ఇటీవల మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని స్థాపించారు ఉద్ధవ్‌ ఠాక్రే. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇక్కడ కూడా గెలిచేయాలని భావించి అధికారం సంపాదించే దిశగా అడుగులు వేసిన చేతిదాకా వచ్చిన అధికారం చేజారి పోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్న నేపథ్యంలో గత దశాబ్దాల నుండి కొనసాగుతున్న బెలగావి భూవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా మరాఠీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం తమదేనని ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత బెలగావి వివాదం ఇప్పుడు మహారాష్ట్ర మరియు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

 

ఖచ్చితంగా బెలగావి సాధించి తీరుతామని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కమిటీ వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీజేపీ నేత యడ్యూరప్ప తీవ్రస్థాయిలో ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన కామెంట్ల పై మండిపడ్డారు. కావాలని కర్ణాటక ప్రజలను రెచ్చగొట్టడానికి ఉద్ధవ్‌ ఠాక్రే బెలగావి వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారని కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్థలం అది ఒక ఇంచు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతం కోసం తీవ్రంగా పోరాడుతున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్హాపూర్‌లో యడియూరప్ప దిష్టిబొమ్మను ఆ పార్టీ నేతలు దహనం చేశారు.

 

దీంతో రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇదే తరుణంలో కర్ణాటక నవనిర్మాణ సేన అధ్యక్షుడు భీమాశంకర్‌ పాటిల్‌ మహారాష్ట్ర ఏకీకరణ సమితి నేతలను రాష్ట్ర సరిహద్దుల్లో నిలబెట్టి తుపాకీతో కాల్చి పారేయాలి అని కామెంట్లు చేయటంతో ఈ వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చాలా ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా మారింది వాతావరణం. రెండు రాష్ట్రాలకు చెందిన ఆందోళనకారులు ముఖ్య మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. అంతే కాకుండా మహారాష్ట్రలో కన్నడ సినిమాలను అడ్డుకుంటున్నారు శివసేన సైనికులు. పరిస్థితి చేజారి పోతుంది తరుణంలో రెండు రాష్ట్రాల రాకపోకలకు సంబంధించిన బస్సుల సర్వీసులను నిలిపివేశారు రెండు ప్రభుత్వానికి సంబంధించిన వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: