తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. తాను కూడా కృష్ణాజిల్లా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ బాటలోనే నడవటానికి డిసైడ్ అయినట్లు సంకేతాలు పంపారు.  గుంటూరు పశ్చిమ  ఎంఎల్ఏ మద్దాలి గిరి వైసిపిలో చేరటం దాదాపు ఖాయమైనట్లే. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు. దాదాపు అర్ధగంటనుండి వీళ్ళ భేటి జరుగుతోంది.

 

గిరి తీసుకున్న తాజా నిర్ణయంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి.  కొద్ది రోజులుగా గిరి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పార్టీలోని తన సన్నిహితులతో కలుస్తున్నా పార్టీ యాక్టివిటీస్ లో మాత్రం పెద్దగా పాల్గొనటం లేదు. అదే సమయంలో మొన్నటి  అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఒకటి రెండు సార్లు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారంతే.

 

రాజధాని మార్పు విషయంలో అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో జరుగుతున్న గొడవ అందరికీ తెలిసిందే. అయితే  ఈ విషయంలో గిరి మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు.  ఇదే విషయమై పార్టీ నేతలు సమావేశానికి పిలిచినా హాజరుకాలేదని సమాచారం. అంటే తెర వెనుక ఏమి జరుగుతోందో ఎవరికీ తెలీదు.  ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే మరోవైపు టిడిపి ఎంఎల్ఏ జగన్ తో భేటి అవ్వటం నిజంగా మింగుడుపడటం లేదు.

 

టిడిపి వర్గాల సమాచారం ప్రకారం గిరి కూడా వంశీ బాటలోనే పార్టీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నారట. కాకపోతే తనకు చంద్రబాబుకి  మధ్య పెద్ద అగాధం ఏర్పడిన తర్వాతే వంశీ పార్టీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. కానీ గిరికి అటువంటి పరిస్ధితి లేదు. మరి పార్టీలో ఎటువంటి సమస్యలున్నాయో తెలీదు. మొత్తానికి  రాజకీయాలు ఇంత హాటు హాటుగా నడుస్తున్న సమయంలో  జగన్ తో భేటి అవ్వటం అంటే మామూలు విషయం కాదు. మరి సిఎంతో భేటి ముగిసిన తర్వాత గిరి ఏం చెబుతారనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: