పరిపాలించాల్సిన ప్రభువే అన్నంపెట్టే రైతన్నలను పోలీసులతో తన్నిస్తూ, వారిపై 307కింద అక్రమకేసులు నమోదుచేయిస్తూ, వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నా డని, రాజధానిప్రాంతంలోని రైతులకు నిద్రాహారాలు లేకుండాచేసిన ఘనత ముఖ్యమం త్రికే దక్కుతుందని టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓట్లేసిన ప్రజలంతా ఎందుకు ఇతనికి ఓటేశామురా... బాబూ అనుకునేలా  జగన్‌ తననిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు, పాదయాత్రలో రాజధానికి అడ్డుచెప్పని జగన్‌, కుల-మతరాజకీయాలకోసం, తన పైశాచిక ఆనందం కోసమే ఇప్పుడు రాజధానిని అడ్డుకుంటున్నాడని వెంకన్న మండిపడ్డారు. 


13 రోజులుగా నానాఇబ్బందులుపడుతూ, రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్న రైతులను పెయిడ్‌ఆర్టిస్ట్‌లంటూ, హేళనగా మాట్లాడటం జగన్‌ విపరీత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. హైపవర్‌ కమిటీ ఒకచెత్త కమిటీ అని, దానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ అన్నీ జగన్మోహన్‌రెడ్డేనని, ఆయనేం చెబితే, ఆకమిటీ దానినే రిపోర్ట్‌ గా ఇస్తుందన్నారు. మంత్రిపదవుల్లో ఉన్నప్పుడు ఆస్తులుకూడబెట్టుకోవడంపై శ్రద్ధ చూపిన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారామ్‌లు, ఇప్పుడు శ్రీకాకుళంలో  నీళ్లులేవ ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 


15ఏళ్లపాటు మంత్రిపదవిలో ఉన్నప్పుడు తన జిల్లాకు మంచినీళ్లు ఇవ్వాలన్న తాపత్రయం, ధర్మానకు ఆనాడుఎందుకు రాలేదని వెంకన్న నిలదీశారు. దేశంలో రైతులు కంటతడిపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, అలాంటి ఘనతపొందిన జగన్‌ చరిత్రహీనుడిగా మిగిలిపోయాడన్నారు. ప్రధానులు మారినప్పుడల్లా దేశరాజధానులు మార్చలేదని,  5కోట్లమంది ఆమోదించిన రాజధానిని కాదనడానికి జగన్‌ ఎవరని బుద్దా ప్రశ్నించారు. ఏపీపరిస్థితి పిచ్చోడిచేతిలో రాయిలా తయారైందని దేశమంతా అనుకుంటోందన్నారు.

 

16నెలలు, జైల్లోఉండొచ్చి, రూ.43వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారు నీతి, నిజాయితీ అనడం సిగ్గుచేటని, అలాంటివారు ఏనోటితో నిజాయితీ అంటున్నారో అర్థం కావడంలేదన్నారు. విజయసాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ భూములపై చర్చకు రావాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జగ్గయ్యపేటలో  భరత్‌కి భూములిస్తే, రాజధానిలో ఆయనకు భూములున్నాయని విషప్రచారం చేయడం విజయసాయికే చెల్లిందన్నారు. రైతుల్ని వేధిస్తున్న జగన్‌ ఇంతకింత అనుభవించేరోజు దగ్గర్లోనే ఉందని వెంకన్న స్పష్టంచేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: