తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటుంది. ఎప్పటినుండో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా పీకేసి ఇతర పార్టీలు రావాలని పట్టు సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా గాని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కేవలం గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే పట్టం కట్టారు. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా ఏమీ లేవు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎప్పటినుండో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నా కానీ చంద్రబాబు మాత్రం కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని చాలాసార్లు ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించిన సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు కామెంట్లు చేసేవి.

 

నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పై చంద్రబాబు కి ప్రేమ ఉంటే ఖచ్చితంగా 2014 ఎన్నికల సమయంలో అమరావతి ప్రాంతంలో కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసే వాళ్ళని కానీ చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు మంచి చేయడం కోసం మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు చేయాలని జగన్ ప్రస్తుతం ఆలోచిస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుంది అన్యాయం చేయాలని చూస్తుంది అంటూ తాజా పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఈ ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజు మరియు ఇతర నాయకులు ఇప్పటివరకు ఇక్కడ చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటువంటి తరుణంలో వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ విడిపోకూడదు అని సీఎం జగన్ అభివృద్ధి అన్నది ఒక సామాజిక వర్గానికి ఏ ఒక్క కులానికో చెందకూడదు అభివృద్ధి అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా జరిగేలా మూడు రాజధానులు విషయం తెరపైకి తీసుకువస్తే...కావాలని చంద్రబాబు ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఇటీవల టిడిపి పార్టీ నాయకుల పై చంద్రబాబు పై సీరియస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: