మరికొద్ది క్షణాల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణాలు రానున్న నేపథ్యంలో చాలామంది రాబోయే సంవత్సరం మొదటి ఘడియలు కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో మరియు ప్రేమించే వ్యక్తులతో ప్రారంభించాలని ఎవరికివారు ప్లాన్ లు వేసుకుంటూ ఉంటున్నారు. ఇటువంటి తరుణంలో చాలా మంది యువత బైక్ రేస్ కార్యక్రమాలు కాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో వృద్ధులతో మరియు అనాధ లతో గడిపి రాబోయే సంవత్సరానికి వాళ్లకి ఆనందాన్ని పంచుతూ అడుగులు వేయాలని ఎక్కువ ప్రస్తుత యువత ఆలోచనలు చేస్తున్నాయి. మామూలుగా అయితే కొత్త సంవత్సరం చాలా మంది యువత తాగుతూ తందనాలు ఆడుతూ బైకుల మీద అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేస్తూ నానా హడావుడి ఎప్పుడూ సృష్టిస్తూ ఉంటారు.

 

కానీ రాబోయే సంవత్సరం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మద్యం సేవించిన మరియు ఎక్కువగా బైక్ పై గుంపులు గుంపులుగా వెళ్ళినా అనేక నియమ నిబంధనలు విధించడంతో చాలా కఠినంగా ఉంటున్న తరుణంలో యువత కూడా తమ ఆలోచనలు మార్చుకుని రాబోయే కొత్త ఏడాది ఆనందం లేని ఆదరణ లేని ప్రజలతో గడిపి నూతన సంవత్సర మొట్టమొదటి ఆనంద క్షణాలను వాళ్లతో ఆస్వాదించడానికి రెడీ అవటానికి ప్రస్తుతం ఎక్కువ యువత ఇష్టపడుతున్నారు.

 

ప్రస్తుత రోజుల్లో మానవత్వంతో ఎక్కువగా స్పందిస్తున్న వాళ్లుగా యువత వివిధ కార్యక్రమాలు ఇటీవల చేపడుతూనే వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్త సంవత్సరంలో కూడా ఇటువంటి ఆలోచనలు కలిగి అడుగులు వేస్తున్న ప్రతి యువతికి మంచి జరగాలని చాలామంది మానవత్వంతో మంచి చేస్తున్న యువతి పై పెద్దలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కేవలం సంవత్సరం మొదటి రోజు మాత్రమే కాకుండా యువత ఎక్కువగా ఇలాంటి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ ఉంటే సమాజం పై అవగాహన ఉంటుంది మరియు అదే విధంగా ఎదుటి వ్యక్తి యొక్క బాధను కూడా అర్థం చేసుకునే మనసు వస్తుందని తాజాగా ఈ వార్త విన్న పెద్దలు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: