ప్రస్తుత సమాజంలో చాలామంది అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా మోసపోతున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళతో సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని ప్రేమలో పడిపోయి చాలామంది మోసపోయిన అమ్మాయిలు ప్రస్తుత సమాజంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రోజురోజుకీ దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు ఘటన పెరగటం మరోపక్క టెక్నాలజీ అందుబాటులో ఉండటం అరచేతుల్లో క్షణాల్లో ఏది కావాలంటే అది తినే వస్తువైనా గాని కొన్ని విషయాల్లో టెక్నాలజీ అందుబాటులో ఉంటున్న ఇటువంటి తరుణంలో పేస్ బుక్ లో అమ్మాయిల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్‌ క్రియేట్ చేసి ఆపై వెబ్‌ క్యామ్ ద్వారా సెక్స్ సర్వీసులు అందిస్తామని చెప్పి ఇటీవల మోసాలకు కొంతమంది పాల్పడుతున్నారు.

 

తాజాగా ఈ విధంగా పాల్పడిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో కూడిన ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను కస్టమర్లుకు ఎరగా వేసి వారు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగానే వారిని ఫేస్‌బుక్‌పై బ్లాక్ చేసేవాడు ఈ ఘరానా మోసగాడు. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా అమ్మాయిల ఫోటోలు పోలీసుల కథనం ప్రకారం ఈ ఘరానా మోసగాడు ఓ ఈవెంట్ మేనేజర్‌‌ను మోసం చేశాడు. ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి ఫోటో పెట్టి ఎరవేశాడు. అయితే ఆ అమ్మాయి నిజంగానే ఈవెంట్ మేనేజర్‌కు స్నేహితురాలు కావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

 

వెంటనే బాధిత మహిళ తన భర్తతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్టు చేసి విచారణ చేయగా మొత్తం వివరాలను కక్కాడు. దీంతో పేస్ బుక్ లో అకౌంట్ మెయింటెన్ చేసే ప్రతి అమ్మాయి ఫోటోలు పెట్టే విషయంలో జాగ్రత్తలు వహించాలని సైబర్ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. మీ ఫోటోలను అడ్డం పెట్టుకుని ఫేక్ అమ్మాయిల పేర్లతో  అకౌంట్ క్రియేట్ చేసి ఈ విధంగా డబ్బులు దండుకునే బ్యాచ్ ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి అంటూ పోలీసులు అమ్మాయిలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: