కాల ప్రవాహంలో 2019 అనే మరో ఏడాది గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో రాజకీయాల్లో ఎన్నో మార్పులు. కాలంలో కూడా చెప్పలేనన్ని వింతలు చోటు చేసుకున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలు ఎంత రసవత్తంగా సాగాయో, తెలంగాణ, ఏపీ ఎన్నికలు కూడా అదేస్దాయిలో కొనసాగాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం కాంగ్రేస్‌కు మరచిపోని షాకు ఇచ్చిన సంవత్సరంగా చెప్పుకోవచ్చూ.. ఇకపోతే మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా.. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

 

 

ఇదే కాకుండా సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో.. సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు, 29 ఏళ్ల ఆదిత్య థాక్రేకు కూడా మంత్రి పదవి లభించింది. మంత్రివర్గంలో తండ్రీ కొడుకులిద్దరూ ఉండటం మహారాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. అదీగాక మాజీ సీఎం విలాస్ రావు దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, సీనియర్ కాంగ్రెస్ నేత ఏక్‌నాథ్ గైక్వాడ్ కుమార్తె వర్షా గైక్వాడ్, ఎన్సీపీ ఎంపీ v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ తత్కారే అదితి తత్కారే‌లకు మంత్రి పదవులు దక్కాయి. ఇక మొత్తం 36 మంది మంత్రుల్లో 26 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయగా.. పది మంది జూనియర్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ విస్తరణలో నలుగురు ముస్లింలు, ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు దక్కాయి.

 

 

ఇదిలా ఉండగా శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్.. 2010 నవంబర్‌లో తొలిసారి డిప్యూటీ సీఎం అయ్యారు. 2012 అక్టోబర్‌లో మరోసారి ఈ పదవిని చేపట్టిన అజిత్ పవార్.. 2019 నవంబర్‌లో బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫడ్నవీస్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయగా.. అజిత్ డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ మూడు రోజులకే బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. అజిత్ మనసు మార్చుకోవడంతో.. ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉద్దవ్ థాక్రే నాయకత్వంలో ఎన్సీపీ, శివసేనకాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోదరుడు v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ రౌత్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడం పట్ల సంజయ్ రౌత్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: