అమ‌రావ‌తిపై బీజేపీలోని త‌న బ్యాచ్‌తో కామెంట్లు చేయిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ...దిమ్మ‌తిరిగే వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌, మూడు రాజ‌ధానులు ఏర్పాటు కావ‌చ్చున‌నే కామెంట్ల‌పై ఇటీవ‌లే బీజేపీలో చేరిన ఎంపీ సుజ‌నాచౌద‌రి త‌దిత‌రులు కౌంట‌ర్లు ఇస్తున్న త‌రుణంలో...జీవీఎల్ ఘాటుగా రియాక్ట‌వుతూ....బాబు బ్యాచ్ ప‌రువు తీసి పారేశారు.

 

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం వ‌ల్ల ఏపీలో అభివృద్ధి కుంటుప‌డుతోంద‌ని...ఏకంగా దే జీడీపీకే న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఎంపీ సుజ‌నాచౌద‌రి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనికి వైసీపీ త‌ర‌ఫున సైతం త‌గు కౌంట‌ర్లు వ‌చ్చాయి. అయితే, బీజేపీ పెద్ద‌లు మాత్రం స్పందించ‌క‌పోవ‌డంతో...సుజ‌నా చౌద‌రి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ వైఖ‌రినే వ్య‌క్తం చేశాడా? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో....టీడీపీకి వాద‌న‌కు అనుకూలంగా సుజ‌నా మాట్లాడుతుండ‌టం సైతం రాజ‌కీయ విశ్లేష‌కుల దృష్టికి వ‌చ్చింది.

 

ఇలా త‌మ పార్టీలో ఉంటూ త‌మ‌నే ఇర‌కాటంలో ప‌డేస్తున్న సుజ‌నాకు బీజేపీ పెద్ద‌లు కౌంట‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. రాజ‌ధాని విష‌యంలో పార్టీలోని నేత‌లు ఎవ‌రు మాట్లాడినా అది వారి అభిప్రాయ‌మే అవుతుంది త‌ప్ప‌...పార్టీ వైఖ‌రి, కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రి కానే కాద‌ని విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన జీవీఎల్ తేల్చిచెప్పారు. రాజ‌ధాని విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోబోద‌ని....ఏపీ ప్ర‌భుత్వం అడిగితే స‌ల‌హా ఇస్తుంద‌ని తెలిపారు. త‌ద్వారా....సుజనా గాలి తీయ‌డ‌మే కాకుండా....బాబుకు అనుకూలంగా మాట్లాడే బ్యాచ్‌...సొంత ప్ర‌చారానికే అలా చేస్తున్నారే త‌ప్పించి...వారిని త‌మ వైఖ‌రి చెప్పే వారిగా గుర్తించ‌న‌వ‌స‌రం లేద‌ని జీవీఎల్ చెప్ప‌క‌నే చెప్పేశారు.  మోదీ సన్నిహిత వ్య‌క్తుల్లో ఒక‌రిగా పేరున్న‌, పార్టీ త‌ర‌ఫున అన్ని వేదిక‌ల్లో బ‌ల‌మైన గ‌లం వినిపించే నేత‌గా ముద్ర ప‌డిన జీవీఎల్ చెప్పిన త‌ర్వాత యినా...స‌ద‌రు నాయ‌కుల్లో మార్పు వ‌స్తుందా? అంటే వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: