న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. థర్టీ ఫస్ట్ నైట్ వేడుకల కోసం యూత్ సిద్ధమవుతోంది. బడాబడా హోటళ్ల నుంచి చిన్నచిన్న హోటల్స్ వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తున్నాయి. కేవ‌లం రెండు రోజుల్లో మనం ఆ పాత సంవ‌త్స‌రం వ‌దిలి కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. మధుర జ్ఞాపకాలు మిగిలిస్తూ 2019 కాలగర్భంలో కలిసిపోతుంది. కోటి ఆశలతో కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది. కొత్త అంటే డైరీలు, క్యాలెండర్ల పేజీలు, మారడం మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం.. కొత్త ప్రణాళికలు వేసుకోవడం.. కొత్త పనులు ప్రారంభించడం.. ఇలాంటివెన్నో ఉంటాయి. 

 

ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. పబ్బులు, రిసార్టుల్లో సెలబ్రేషన్స్‌ సందడి మామూలుగా ఉండదు. అయితే మ‌రి న్యూ ఇయ‌ర్ ముందుగా ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా..? నూతన సంవత్సరాన్ని మొదట చిన్న ద్వీప దేశమైన టోంగా, సమోవా మరియు కిరిబాటిలలో జరుపుకుంటారు. అక్కడ న్యుఇయర్ మనకంటే ఏడుగంటల ముందే వస్తుంది. న్యూజిలాండ్, భారత్ కంటే ఏడు గంటల ముందే అక్కడ న్యూఇయ‌ర్ వేడుక‌లు స్టాట్ అవుతాయి. అక్క‌డ వారు దీనిని ఒక పవిత్ర రోజుగా ప్రజలు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. 

 

ఎక్కడి దాకో ఎందుకు మన దేశంలోనే న్యూఇయర్  ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుగుతుంది. ఇక అందరూ వేడుకలు జరిపేసుకున్నాక... చివరిగా అమెరికాలోని సమోవా దీవుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటారు.  అలాగే  కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త పనులకు శ్రీకారం చుట్టండి. వీటివల్ల గతంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ప్లాన్ వేసుకొని చేసిన పని విజయవంతం అయితే అది ఇచ్చే సంతృప్తి మరో పనిని ప్రేరేపిస్తుంది. సో.. పాత సంవత్సరాన్ని నెమరు వేసుకుంటూ కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటూ అందరూ సంబరాలకు సిద్ధం అవ్వండి. హ్యాపీ న్యూ ఇయ‌ర్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: