తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అమరావతి పరిరక్షణ పేరుతో ఉద్యమం చేస్తోంది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తోంది. రాజధానిని విశాఖకు మార్చేయాలని డిసైడ్ అయ్యాడు. జగన్ నిర్ణయంతో కుదేలైన తెలుగుదేశాధినేత ఈ నిర్ణయాన్ని ఆపే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ క్యాడర్ తో ఆందోళన చేయిస్తున్నారు. ఎన్ని చేసినా ఉద్యమం కేవలం రాజధాని గ్రామాలకే పరిమితం అవుతోంది.

 

ఈ సమయంలో జగన్ చంద్రబాబుకు ఓ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేతోనే తనకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంత వైసీపీ నేతలు జగన్ నిర్ణయానికే తమ ఓటు అని తేల్చి చెప్పారు. ఇక ఇప్పుుడు రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేతోనూ విశాఖకు రాజధాని మార్పు నిర్ణయానికి జై కొట్టించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.

 

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి లేదని మద్దాలి గిరి అన్నారు. రాజధాని అంశంలో సీఎం జగన్‌కు స్పష్టమైన ఆలోచన ఉందని కితాబిచ్చారు కూడా. అంతేకాదు..శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని సీఎం తనకు స్పష్టం చేశారన్నారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం జగన్‌ను కలిశానని మద్దాలి గిరి చెప్పారు.

 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు సీఎఫ్‌ఎంఎస్‌ బకాయిల అంశాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని మద్దాలి గిరి చెప్పారు. సీఎం వెంటనే స్పందించి 25 కోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని గిరి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదర్శంగా మారాయని గిరి అన్నారు. మొత్తానికి జగన్ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలతోనే తన నిర్ణయానికి మద్దతు ఇప్పించుకుంటూ చంద్రబాబుకు షాకు మీద షాకులు ఇస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: