మూడు పార్టీల కలయిక కూటమితో ఏర్పడిన మహారాష్ట్ర కేబినెట్ ఇప్పుడు పూర్తిస్థాయి విస్తరణ జరిగిందిఅనేక కసరత్తుల తర్వాత ఫైనల్ గా కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. అయితే ఈ విస్తరణలో ఉద్ధవ్ ఠాక్రె అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. అంతా గెస్ చేసినట్టుగానే ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ విస్తరణతో ఠాక్రే వారసుడు కూడా కేబినెట్లోకి వచ్చేశాడు.

 

 

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఆదిత్యకు కేబినెట్‌లో చోటు దక్కింది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్ అఘాఢి కూటమికి చెందిన పలువురు శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మొత్తం 35 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం ఉద్ధవ్‌ థాకరే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు. ఆదిత్య థాకరేకు ఎడ్యుకేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ శాఖలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.

 

 

ఇక మిగిలిన మంత్రుల విషయానికి వస్తే... అశోక్ చవాన్, దిలీప్ పాటిల్, ధనంజయ్ ముండే, అనిల్ దేశ్ ముఖ్, హసన్ ముష్రిఫ్, వర్షా గైక్వాడ్, రాజేంద్ర షింగానే, నవాబ్ మాలిక్, రాజేశ్ తోపే, నునిల్ కేదార్, సంజయ్ రాథోడ్, గులాబ్ పాటిల్, బాలాసాహెబ్ పాటిల్, అనిల్ పరబ్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

 

 

ఇక పార్టీల పరంగా చూస్తే.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 10 మంది కేబినెట్‌ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మందికి కేబినెట్‌ పదవి వరించింది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవి దక్కింది. శివసేన నుంచి ఆరుగురు మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేఎస్‌పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కేబినెట్‌ మంత్రిగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను సహాయమంత్రిగా తీసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్యను కేబినెట్‌లో తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: