ప్రధాని మోడీ నివసించే మార్గంలో చాలా సెక్యూరిటీ ఉంటుంది.  అటు వైపే వెళ్లే వ్యక్తులను నిత్యం పరిశీలిస్తుంటారు.  ఇక ప్రధాని నివాసం హైసెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళాలి అంటే మామూలు విషయం కాదు.  సామాన్యులు అసలు అటువైపు కన్నెత్తి కూడా చూసేందుకు అవకాశం ఉండదు.  పైగా ప్రధాని ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని తెలిసినప్పటి నుంచి మోదికి భద్రతను పెంచారు.  ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.  


ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఎక్కడికక్కడ చలి పెరిగిపోతున్నది.  ఇంతటి చలిలో కూడా ఢిల్లీలో ఎక్కడో ఒక చోట అగ్నిప్రమాదం జరుగుతూనే ఉన్నది.  ఈ నెలలోనే పదికి పైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి.  తాజాగా ప్రధాని మోడీ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది.  హైసెక్యూరిటీ జోన్ లో ఉండే ప్రాంతంలో, నిత్యం అధికారులు, పోలీసులు డేగకళ్లతో పహారా కాసే ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది అంటే షాకింగ్ అని చెప్పాలి.  

 

ఈ రాత్రి 7:30 గంటల సమయంలో ప్రధాని నివాసంలోని ఎలక్ట్రిక్ కంట్రోల్ రూల్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  9 ఫైర్ ఇంజన్లు ప్రధాని నివాసానికి చేరుకున్నాయి.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాని ఇంటివైపు వెళ్లే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రాంతాన్ని మూసివేశారు.  అధికారులు ఫైర్ ఇంజన్ల సహాయంలో మంటలు ఆర్పుతున్నారు.  అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదని అంటున్నారు.  


ప్రమాదం పెద్దది కాకముందే అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.  ప్రధాని నివాసంలో షార్ట్ సర్క్యూట్ కావడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ అగ్ని ప్రమాదాల ఎఫెక్ట్ మోడీ నివాసానికి కూడా తగలడం విశేషం.  ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఢిల్లీ ఇప్పటికే వందమందికి పైగా మరణించారు.  కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.  చలికాలంలోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఇక ఎండాకాలం వస్తే పరిస్థితి ఏంటో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: