కోటికి పైగా జనాభా ..లక్షల్లో వాహనాలు.. దీనికి తోడు నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్లపై వస్తున్నాయి. మమూలు సమయంలోనే ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంటుంది. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ చెప్పనక్కర్లేదు....నగర ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీర్చుతూ, పాశ్చాత్య నగరాలకు తీసిపోకుండా అత్యున్నత భాగ్యనగరాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనల నుంచి పుట్టినదే బృహత్తర పథకం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ). ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే లక్ష్యంగా.. 2019లో ప్రజారవాణాకు పెద్దపీట వేశారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) లో భాగంగా పలు ప్రాజెక్టులు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ఇందులో కొన్ని ఫ‌లితాలు ఇవ్వ‌గా...ఇంకొన్ని మ‌రిన్ని ఫ‌లితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.

 

ఎస్ఆర్డీపీలో భాగంగా, తొలి దశలో సుమారు రూ. 22 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే 2019లో ఎల్‌బీనగర్ పైవంతెన (రూ.42.74కోట్లు), రాజీవ్ గాంధీ ఫ్లై ఓవర్ (రూ. 97.94 కోట్లు), బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ లెవల్-2 (రూ. 69.47కోట్లు ) నిర్మాణాలను పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీర్చారు. పురానపూల్, కర్మాన్‌ఘాట్, కిస్మత్‌పుర, సైబర్‌సిటీ ఖానామెట్, ప్యారడైజ్, శివాజీ బ్రిడ్జి, కవాడిగూడ, బోరబండ బస్‌స్టాప్, సుచిత్ర ఫేజ్-2, ఐడీపీఎల్, సిటీ కాలేజ్‌ల వద్ద జంక్షన్లను అభివృద్ధి చేశారు. పలు రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు. కీలక పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలన్న బృహత్ లక్ష్యం తో జీహెచ్‌ఎంసీ చర్యలు చేపడుతొంది. వీటితో పాటు ఈ ఏడాదిలో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభా గం పరిధిలో జరిగిన జంక్ష న్ల అభివృద్ధ్ది, పాదచారుల సౌకర్యార్థం ఫుట్‌ఓవర్ బ్రి డ్జి, నైట్ షెల్టర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈత కొలనులు, స్టేడియంలు, నాలాల అభివృద్ధి చేయ‌నుంది. 

 

భారీ వర్షాల నేపథ్యంలో నీరునిలిచే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు గ్రేట‌ర్ అధికారులు చెప్తున్నారు. వరద ముంపు లేకుండా నివారణ చర్యలు చేపట్టారు. మూసీ రివర్ వెంట, సాకీ చెరువు, ఫ్యాక్స్ సాగర్ చెరువు, అక్భర్ నగర్ నాలా అభివృద్ధి పనులను పూర్తి చేశారు. పురానాపూల్, కర్మాన్‌ఘాట్, కిస్మత్‌ఫుర, సైబర్‌సిటీ ఖానామెట్, ప్యారడైజ్, శివాజీ బ్రిడ్జి, కవాడిగూడ, బోరబండ బస్టాప్, సుచిత్ర ఫేజ్-2, ఐడీపీఎల్, సిటీ కాలేజ్‌ల వద్ద జంక్షన్లను అభివృద్ధి పరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: