డిసెంబ‌ర్ 31 వ‌స్తుంటే... నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో పాటుగా కొత్త సంవ‌త్స‌రం సంబురాల‌ను ఏ విధంగా ఆస్వాదించాల‌నే ఆలోచ‌న కూడా సహ‌జంగానే వ‌స్తుంది. పార్టీల విష‌యంలో...నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం అయితే చికెన్‌ను ఇష్టపడినంతగా మటన్ ఇష్టపడరు. కానీ పార్టీకి మ‌ట‌న్ కూడా బాగుంటుంద‌ట‌. ఇటీవల ఓ పరిశోధనలో మటన్ లో అనేక ఉపయోగాలున్నట్లు తేలింది.మటన్ లో  B1,B2 ,B3, B9 ,B12, విటమిన్ E,K కూడా ఉంటాయి. అంతేగాకుండా ఓమెగా 3 ఫ్యాటీసైడ్స్, ఓమేగా 6 ఫ్యాటీసైడ్స్ ఉంటాయి. ఇందులో B12 ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని ఎక్కువగా ఉండే కొవ్వును కరిగిస్తుంది. B12 ఎర్రరక్తకణాలు ఏర్పడతాయి. మటన్ లో అనేక  ప్రోటీన్లు ఉంటాయి.ఐరన్ ఉంటుంది,ఫ్యాట్ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది.

 


మటన్‌లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుందని ఈ అధ్య‌య‌నంలో స్ప‌ష్ట‌మైంది. బీ కాంప్లెక్స్, సెలీనియం, కొలీనియం ఉండటం వల్ల క్యాన్స్ ర్ నుంచి తప్పించుకోవచ్చు అని ప‌రిశోధ‌న‌లు తేల్చాయి. మటన్‌లో పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల రక్తపోటు,గుండెపోటు, కిడ్నీ సంబంధ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చున‌ని వారు స్ఫ‌ష్టం చేశారు. అందుకే, మీ కొత్త సంవ‌త్స‌రాన్ని చికెన్‌తో కాకుండా మ‌ట‌న్‌తో జ‌రుపుకోండి. ఇటు కొత్త రుచిని ఆస్వాదించిన ఫీలింగ్‌తో పాటుగా...అటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోండి.

 

ఇదిలాఉండ‌గా, దేశంలో కొత్త నిరసన వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాసులు. ఇటీవ‌ల కిలో మటన్ దాదాపు రూ.700లు పలక‌డంతో ఈ రేట్లను చూసి సామాన్యులు షాక్ తిన్నారు. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడుతున్నామని...మటన్ ధరలు కూడా పెరిగితే మాంసాహారానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో కొల్హాపూర్ వాసులు వినూత్న నిరసనకు దిగారు. తామే స్వయంగా మేకలు కోసి.. మార్కెట్లో తక్కువ ధరకే మటన్ అమ్ముతున్నారు. కిలో మటన్‌ను రూ.400-450కే అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో స్థానికులంతా ఒకే తాటిపై ఉన్నారు. రెండు మూడు రోజుల పాటు ఇలాగే అమ్మకాలు సాగించడంతో మటన్ వ్యాపారులకు గిరాకీ తక్కువయింది. దాంతో ఎట్టకేలకు దిగొచ్చి స్థానికులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం మటన్ ధరలను కిలోకు రూ.200 మేర తగ్గించారు. ప్రస్తుతం కొల్హాపూర్‌లో కిలో మటన్ ధరను రూ.480గా ఖరారు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: