ఈ మద్యకాలంలో ఇంట్లోనే కూర్చుని హాయిగా పనిచేస్తూ సంపాదించాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇందుకోసం అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని మోసకారి ప్రకటనలు కూడా ఉన్నాయి. ఇక ఎక్కడ చూడు 'వర్క్ ఫ్రమ్ హోమ్' పోస్టర్లు ఈ మద్యలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి బస్సుల్లో, రైళ్లల్లో, రద్దీ ప్రాంతాల్లో మొదలగు ప్రజాకర్షణ ఉన్న ప్రాంతాల్లో కనిపించేలా అంటించి ఉంటాయి. అయితే చాలా మంది తెలియక ఇలాంటి ప్రకటనలు చూసి వారికి కాల్ చేసి మాట్లాడుతారు.

 

 

ఒక వేళ మీరు కాల్ చేసిన కంపెనీ వారు జన్యూన్ పర్సన్స్ అయితే మీకు ఏమి ఇబ్బంది లేదు. అదే ఎదుటివారు కనుక మోసగాళ్లు అయితే ఇలాంటి వారి వల్ల మీరు దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎక్కువగా మోసాలు ఏ రూపంలో జరుగుతాయో చెప్పడం కష్టం. కానీ అందులో ఇలా మోసం చేయడం కూడా ఒక పద్దతి. అదెలాగంటే ఇటీవల ఓ వ్యక్తి 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో రూ.1,47,000 నష్టపోయినట్టు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇలా జరిగే మోసాలను ఉదహరిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 

 

ఇక ఈ మద్యకాలంలో మోసపోయిన ఓ వ్యక్తి గురించి తెలిపారు. ఆ వివరాలు చూస్తే. 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆఫర్ ఉందని, గచ్చిబౌలిలో నివసించే నాగరాజు అనే వ్యక్తికి స్నేహ అనే యువతి కాల్ చేసి నెలకు రూ.12,000 చొప్పున సంపాదించుకో వచ్చని ఆశ చూపింది.. దీంతో ఆ యువకుడు ఆఫర్ ఒప్పుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక మరో వ్యక్తి అడ్వకేట్ పేరుతో ఫోన్ చేసి, మీకు ఆఫర్ ఇచ్చిన కంపెనీపైన కేసులు నమోదయ్యాయని, అందులో పనిచేస్తున్నందుకు మీ పైన కూడా కేసు పెట్టామని సదరు వ్యక్తి బెదిరించాడు.

 

 

ఈ కేసుల నుండి బయటపడాలంటే కొంత మొత్తం ఖర్చవుతుందని తెలుపగా ఆ వ్యక్తి 1,47,000 చెల్లించాడు.. ఇలా చాలా మంది నిరుద్యోగులు మోసగాళ్ల వలలో పడుతున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎవరైనా డబ్బులు అడగడం గాని, బెదిరింపులకు పాల్పడటం గాని చేస్తే వెంటనే అది పక్కా మోసమనే గుర్తించి, భయపడకుండా పోలీసుల్ని సంప్రదించాలని తెలుపుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: