ప్రపంచంలోని ఎంతో ప్రఖ్యాతి గాంచిన, అలానే మెజారిటీ ప్రజలు వీక్షించే క్రీడల్లో క్రికెట్ కూడా ఒకటని ఇటీవల కొన్ని నివేదికలు కూడా వెల్లడించాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వంటివి వచ్చాయి కానీ, కొన్నేళ్ల క్రితం అయితే మన భారత ప్రజలు క్రికెట్ ని మరింతగా ఆదరించేవారు. ఇండియా మ్యాచ్ ఏదైనా వస్తుంది అంటే చాలు గుంపుగుంపులుగా నిలబడి మరీ గంటలకొద్దీ వీక్షించే వారు. అలానే అప్పట్లో క్రికెట్ క్రీడాకారులను కొందరు ఎంతగానో ప్రేమించే వారు. ఇక క్రికెట్ లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న కొందరు క్రీడాకారులున్నారు. ఇక తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రపంచ దేశాలను వణికించిన షేన్ వార్న్ గురించి అప్పట్లో తెలియని వారు ఉండరనే చెప్పాలి. 

 

ఆస్ట్రేలియా తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడిన వార్న్, తన బౌలింగ్ మాయాజాలంతో తమ దేశాన్ని గెలిపించిన మ్యాచ్ లు కూడా ఉన్నాయి. అయితే అంత గొప్ప క్రీడాకారుడైన వార్న్ జీవితం, మాటల్లో వర్ణించరానంత ఇబ్బందికరమైంది. అందరు మగవాళ్ళవలె ఏరి కోరి సైమన్ అనే అమ్మాయిని వివాహమాడిన వార్న్, తన లైఫ్ లో ఎందరో అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని, పలు కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు ఎంతో చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఒక ఆసుపత్రి నర్సుతో తప్పుడుగా వ్యవహరించి పలు సమస్యలు ఎదుర్కొన్న వార్న్, తన భార్యకు సైతం కొన్ని సార్లు అక్రమ సంబంధాల ద్వారా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇక 2005లో ఏకంగా తన చుట్టూ 25 మంది మోడళ్లతో లోచెడ్డి వేసుకుని దిగిన ఫోటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపాయి. అప్పటికే అతడి అక్రమ సంబంధాలతో విసిగిపోయిన వార్న్ భార్య సైమన్, అతడి నుండి విడిపోయింది. 

 

అయితే 2007 సమయంలో అతడిలో మంచి మార్పు వచ్చి ఉంటుందని, అతడితో మాట్లాడి మళ్ళి కొత్త జీవితం గడపాలకున్న ఆమెకు, ఓక్ పెద్ద షాకే తగిలింది. ఒకరోజు తామిద్దరి ఫోన్ సంభాషణ తరువాత, వేరే ఒక గర్ల్ ఫ్రెండ్ కి పంపాలలనుకున్న ఫోన్ సందేశాన్ని పొరపాటున భార్య సైమన్ కు పంపిన వార్న్, ఆ ఘటన తరువాత ఆమె నుండి పూర్తిగా అసహ్యించుకోబడ్డాడు. ఆస్ట్రేలియాలోని పలు ప్రసార మాధ్యమాల్లో అప్పట్లో వార్న్ అక్రమ సంబంధాల బాగోతం బయటపడడంతో అతడిపై అక్కడ బాగా విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఈ విషయాలన్నీ అతడి వ్యక్తిగతం అయినప్పటికీ, క్రికెట్ పరంగా వార్న్ మాత్రం ఒక గొప్ప ఆటగాడు అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: