దిశ ఘటన.. ఇంకో పదేళ్లు అయినా ఈ ఘటన గుర్తొస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి దారుణమైన ఘటన ఇది. నలుగురు కామాంధులు వెటర్నరీ డాక్టర్ అయినా దిశను దారుణంగా సామూహిక అత్యాచారం చేసి సజీవదహనం చేశారు. అయితే దేవుడు ఉండటం వల్ల ఆ నలుగురు పోలీసులకు దొరికారు. 

 

దీంతో ఆ నలుగురిని హై కోర్టు 14 రోజులు రిమాండ్ కు తరలించగా వారిని పోలీసులు విచారణలో భాగంగా దిశ ఘటన జరిగిన స్థలానికి ఆ నలుగురిని రీకంస్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా ఆ నలుగురు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆ నలుగురిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

అయితే ఈ ఎన్కౌంటర్ పై పిటిషన్ దాఖలు అయ్యాయి. వారి శవలు కుళ్లిపోయేవారుకూ ఆస్పత్రిలోనే ఉన్నాయి. చివరికి రెండోసారి రీపోస్టుమార్టం చేసి అంత్యక్రియలు జరిగాయి. అయితే ఈ ఘటన ముగిశాక ఈ ఘటనపై కొన్ని టీవీలు ప్రోగ్రాం చేశాయి. ఆ ప్రోగ్రాంలలో భాగంగానే ఓ ప్రముఖ టీవీ సంస్ధ ఓ వింతైన ప్రోగ్రాం చేసింది. 

 

అదే ''దిశ ఘటన తర్వాత.. 'హైదరాబాద్'లో అర్దరాత్రి ఆడపిల్ల పరిస్థితి ఇలా.'' అనే ప్రోగ్రాం. చేశారు. ఆ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి దిశ ఘటన జరిగిన లాంటి చోటే రోడ్డుపై నించుంటుంది. దీంతో వచ్చి పోయేవారంతా కూడా ఆమెను కాపాడటానికి..ఆమెకు తోడుగా ఉండేందుకు సహాయం చేస్తారు. 

 

ఎందుకు ఉన్నారు ? మిమ్మల్ని డ్రాప్ చెయ్యాలా ? ఇబ్బంది ఏమైనా వుందా ? అని వచ్చిపోయేవారంతా అడుగుతారు. అయితే ఆమె ఎవరి సహాయం తీసుకోదు కానీ ఒక అతను మాత్రం.. మళ్ళి ఏది దారుణమైన ఘటన జరగకూడదు మీరు ఫస్ట్ వెలుతురు ఉన్న చోటకు వెళ్ళండి అని ఆమెను పంపిస్తారు. 

 

దీంతో ఆ యువతీ టీవీ ముందు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. చుడండి.. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు కేర్ తీసుకుంటున్నారు.. తన చెల్లి, అమ్మకు ఎలా హెల్ప్ చేస్తారో అలానే చేశారు. చూశారు కదా.. ఇప్పుడు అమ్మాయి అర్ధరాత్రి బయట కనిపించిన ఆమెకోసమే జాగ్రత్త తీసుకోవడంతో.. మహిళలు అందరూ గుండె దైర్యంతో ఉండండి అని చెప్తుంది.

 

అయితే ఆ వీడియో స్ఫూర్తిదాయకంగా ఉన్నప్పటికీ ఆడవారు 7 గంటలు దాటితే బయటకు రాకుండా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న ఈ కాలంలో మానవ మృగాలు ఉన్నాయి. అవి అంతం అవ్వవు అందుకే ఆడవారే జాగ్రత్తగా ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: