ఇప్పుడు లోకంలో బ్రతకడానికి కావలసింది విలువలు కాదు. డబ్బు. ఈ డబ్బు ఉంటే చాలు, దీనికోసం సిగ్గు, మానం అన్ని వదిలేయవచ్చు. అందుకే ఎక్కువగా యువత వ్యభిచారం వైపు మొగ్గుచూపుతున్నారు. పందిమందిలో పరువులేకున్న చాలు కానీ సుఖపడడానికి ఇంటినిండా డబ్బు ఉంటే చాలు అనే ఆలోచనలతో అడ్డమైన పనులు చేయడానికి కూడా మనుషులు వెనుకాడడం లేదు. ఇక ఓ మహిళ మగవాళ్లకు వలవేసి, వారిని నమ్మించి, వారికి ఒక్క రాత్రి  సుఖాన్నిచ్చి, అందినకాడికి దోచుకుని పోతుంది ఇలా ఇప్పటి వరకు 78 లక్షలకు పైగా కొల్లగొట్టిందట. ఇదో తేనేపూసిన కత్తి. ఈ కిలాడి చేష్టలు తెలుసుకుంటే.

 

 

కాటెలిన్ వోజ్టోవిచ్(25) అనే యువతిని మూడు వేర్వేరు చోరీ కేసుల్లో బుధవారం ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు పరిశీలిస్తే.. మొదట డేటింగ్ పేరుతో బాగా డబ్బు ఉన్న వారికి కాటెలిన్ దగ్గరవుతుంది. ఆ తరువాత పూర్తిగా నమ్మకాన్ని చూరగొంటుంది.. ఆ తర్వాత హోటళ్లకు తీసుకెళ్లి వారిని స్వర్గంలో ముంచేసి అనంతరం అదును చూసి వారి చేతికి ఉన్న విలువైన వాచీలు, పర్సులను తీసుకొని అక్కడి నుంచి ఉడాయిస్తుంది.

 

 

ఇలా మొదటి సారిగా 2018 లో మియామీ బీచ్‌లోని మోకాయ్ లాంజ్‌లో, మేలో విక్సెన్‌తో పరిచయం పెంచుకొని అతను ఉంటున్న ఫోంటైన్‌బ్లో హోటల్‌కు వెళ్లింది. రాత్రి ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి పడుకున్నారు. అయితే, తెల్లవారే సరికి విక్సెన్‌కు కాటెలిన్ కనిపించలేదు. అదే సమయంలో అతని దగ్గరున్న రూ. 90వేలు విలువ చేసే అతని చేతి వాచీ, రూ. 86వేల నగదు, రూ.57వేల యాపిల్ ఐఫోన్, రూ. 47వేల గూచీ బెల్ట్ మాయమయ్యాయి. ఇల మరోసారి అదే సంవత్సరం మియామీ బీచ్‌కు వచ్చిన న్యూయార్క్ వ్యక్తిని కూడా ఇలాగే బోల్తా కొట్టించి ఆ వ్యక్తి చేతికి ఉన్న రూ. 4లక్షల విలువ చేసే వాచీని తీసుకొని అక్కడి నుంచి జంప్ అయ్యింది..

 

 

ఇకపోతే ముచ్చటగా మూడోసారి 2019 లో, జనవరిలో మాండ్రియన్ హోటల్ బార్‌లో మరో యువకుడిని వలలో వేసుకున్న ఈ కిలాడీ. రాత్రికి అతని రూమ్‌కు వెళ్లి రూ. 1లక్ష 43వేల నగదు, రూ. 71వేలు విలువ చేసే రొలెక్స్ వాచీ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది. ఇలా కాటెలిన్ ఏడాది కాలంలోనే రూ. 78 లక్షలకు పైగా కొల్లగొట్టింది. ఇలా సులభంగా మనీ సంపాదిస్తూ జల్సాలకు అలవాటు పడిన ఈ యువతి మరొకరిని ఇలాగే దోచుకోబోయి పోలీసులకు చిక్కింది.

 

 

దాంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా.  ఆమె చేసిన చోరీలకు సంబంధించిన  సీసీటీవీ ఫుటేజీని పోలీస్ అధికారులు జడ్జి ముందు పెట్టగా, న్యాయస్థానం కాటెలిన్‌ను దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఈ కేసు ఇంక విచారణ దశలోనే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: