ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

 

ఈ క్రమంలోనే ఈ వచ్చే నెల 2020 జనవరిలో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2020 కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో 4 ఆదివారాలు, రెండు శనివారాలు క్లోజ్ ఉంటాయి. వివిధ పండుగలు రావడంతో బ్యాంకులకు దాదాపు 16 రోజులకుపైగా సెలవు రోజులు ఉన్నాయి.  

 

ఆ సెలవులు ఇవే... జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం, జనవరి 2వ తేదీ గురుగోవింద్ సింగ్ జయంతి, జనవరి 5వ తేదీ ఆదివారం, జనవరి 7వ తేదీ ఇమోయిను ఇరత్పా, జనవరి 8వ తేదీ గాన్‌ఘాయి, జనవరి 11వ తేదీ రెండో శనివారం, జనవరి 12వ తేదీ ఆదివారం, జనవరి 14వ తేదీ భోగి, జనవరి 15వ తేదీ ఉత్తరాయణ మకర సంక్రాంతి, పొంగల్, జనవరి 16వ తేదీ తిరువల్లూర్ డే, జనవరి 17వ తేదీ ఉజావర్ తిరునాల్ సెలబ్రేషన్స్, జనవరి 19వ తేదీ ఆదివారం, జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 25వ తేదీ నాలుగో శనివారం, జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే, జనవరి 30వ తేదీ సరస్వతిపూజ, వసంత పంచమి రోజులు సెలవులు వస్తాయి.

 

బ్యాంకులకు ఇన్ని సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్ చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. చూశారుగా జనవరి నెలలో 16 రోజులు బ్యాంకులకు సెలవలు ఉన్నాయి. కాబట్టి సెలవు లేని రోజు బ్యాంకు పనులు పెట్టుకోవడం మంచిది. ముందు జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ఒకవేళ మీరు స్టార్ట్ అప్ కంపెనీ నడిపితే ఇలా ఇన్ని రోజులు సెలవలు ఉన్నాయి అని.. బ్యాంకుకు సెలవు అని ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా టార్చర్ చెయ్యకండి.. ఏ రోజు బ్యాంకు ఉంటుందో ముందే చూసుకొని ఉద్యోగులకు సరైన సమయంలో శాలరీ క్రెడిట్ చెయ్యండి. ముందే ఈ నెలలో పండుగలు ఎక్కువ... 

మరింత సమాచారం తెలుసుకోండి: