ఎవరి దగ్గరైనా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఉంటే బ్యాంకులో లేదా బీరువాలో దాచుకుంటారు లేదా స్థలాలను కొనటం లేదా వేటిమీదైనా పెట్టుబడులు పెట్టటం చేస్తారు. కానీ ఆ జంట మాత్రం ఏకంగా ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 14 లక్షల రూపాయలను చెత్తకుప్పలో పడేసింది. కానీ ఆ జంట 14 లక్షల రూపాయలను కావాలని చెప్పకుప్పలో పడేయలేదు. ఆ జంట వారికి తెలియకుండానే 14 లక్షల రూపాయలను చెత్తకుప్పలో పడేసింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే యూకెలోని బర్నింగ్ హమ్ కు చెందిన ఒక జంట సమీప బంధువు చనిపోయింది. ఆ తరువాత ఈ జంట ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి అనవసరమైన వస్తువులను, పనికిరాని చెత్తను కారులో తీసుకొనివెళ్లి సమీపంలోని డంపింగ్ యార్డులో పడేశారు. చెత్తను వేరు చేసే కార్మికులు ఆ చెత్తలో ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 14 లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. 
 
కార్మికులు ఆ డబ్బులో ఒక్క నోటును కూడా తీసుకోకుండా సమీప పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిజాయితీగా డబ్బును ఇచ్చిన కార్మికులను అభినందించారు. ఆ తరువాత పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరీశీలించి చెత్తను పడేసిన వారిని గుర్తించారు. పోలీసులు ఆ జంట ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. 
 
ఆ జంట తాము ఇంటిని శుభ్రం చేస్తుండగా వచ్చిన చెత్తను పడేశామని అందులో డబ్బు ఉన్న విషయం తమకు తెలియదని చెప్పింది. ఆ జంట చనిపోయిన వారి సమీప బంధువుకు వస్తువుల మధ్య డబ్బును దాచుకునే అలవాటు ఉందేమో అని చెప్పింది. పోలీసులు ఆ జంట చెప్పింది నిజమేనని రుజువు అయిన తరువాత ఆ తరువాత పోలీసులు ఆ జంటకు డబ్బును తిరిగి ఇచ్చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: