టీఆర్‌ఎస్‌ త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల కోసం  సిద్ధమవుతున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్షేత్రస్థాయిలో కేడర్‌ నడుమ తీవ్ర పోటీ నెలకొంది.  నియోజక వర్గ స్థాయిలో నేతలు పార్టీ ఎమ్మెల్యేలు తమకు అవకాశమివ్వాలంటూ , నియోజక వర్గ ఇన్‌చార్జిలపై ఒత్తిడి పెంచుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతోపాటు వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతల నడుమ చాలా చోట్ల క్షేత్రస్థాయిలో సమన్వయం కనిపించడం లేదు.మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు  పార్టీలో పాత, కొత్త నాయకత్వం మధ్య వర్గపోరు నడుస్తుండటంతో  వ్యవహారం టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి సవాలుగా మారింది.


 కాంగ్రెస్‌ నుంచి  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.  టీఆర్‌ఎస్‌తో  టీడీసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపీ కూడా సన్నిహితంగా ఉంటున్నారు. మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు డజనుకుపైగా  గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. 


ఇటీవల జరిగిన పార్టీ ఇన్‌చార్జిల సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాండూరు, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో టికెట్ల కేటాయింపులో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా ప్రస్తావించారు.  120 30కిపైగా మున్సిపాలిటీల్లో  మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా టీఆర్‌ఎస్‌లో వివిధ సందర్భాల్లో నేతల నడుమ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. గ్రూపుల గోల లేని మున్సిపాలిటీల్లోనూ టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.

 


గతంలోనే  టీఆర్‌ఎస్, ఇతర పార్టీల బలాబలాలు మున్సిపాలిటీలు, వార్డులవారీగా , సొంత పార్టీతోపాటు ఇతర పార్టీల్లో క్రియాశీల నాయకులు, కార్యకర్తల వివరాలతో పార్టీ ఇన్‌చార్జిలు నివేదికలు రూపొందించారు. అయితే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో మరోమారు తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా నాలుగు రోజుల క్రితం జరిగిన పార్టీ ఇన్‌చార్జిల సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. పార్టీ ఇన్‌చార్జిల తాజా నివేదికలు, వార్డులు, డివిజన్లు, చైర్మన్‌ పదవుల రిజర్వేషన్ల వివరాలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని గ్రూపు కొట్లాటలతో సంబంధం లేకుండా టికెట్లు కేటాయించాలని కేటీఆర్‌ పదేపదే ఆదేశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇన్‌చార్జిల నివేదికలు అందిన తర్వాత జనవరి 2న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, అసమ్మతుల బుజ్జగింపు, తటస్థులు, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రచార వ్యూహం తదితరాలపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: