మొన్న ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. రాజధానిగా విశాఖను ఖరారు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో జగన్ పర్యటనకు ప్రాధాన్యత వచ్చింది. అయితే జగన్ కు విశాఖలో ఘన స్వాగతం లభించింది. కిలోమీటర్ల పొడవునా జనం దారికి ఇరుపక్కలా నిలుచుని స్వాగతం పలికారు.

 

జగన్ కాన్వాయ్ పై పూలు చల్లారు. కొన్నిచోట్ల అభిమానుల తాకిడి కారణంగా జగన్ కాన్వాయ్ ను నిలిపేయాల్సి వచ్చింది. అయితే ఈ సీన్ చూసి ప్రతిపక్షనేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారా.. జగన్ కు లభించిన ఇంతటి ఘన స్వాగతాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారా.. అవునంటున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే.. మొన్నటి ఎన్నికల్లో కాస్తో కూస్తో మంచి సీట్లు వచ్చిన జిల్లా టీడీపీకి విశాఖ పట్నమే. విశాఖ నగరంలోనే టీడీపీ సత్తా చాటింది. మరి అలాంటి చోట కూడా జగన్ కు ఘన స్వాగతం లభిస్తే.. ఇక తన ఎమ్మెల్యేల సంగతేంటన్న బెంగ చంద్రబాబుకు పట్టుకున్నట్టు వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు.

 

 

ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు అపూర్వ స్వాగతాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పిచ్చిపట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు.

 

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన సీఎంకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు వచ్చిన అపూర్వ స్వాగతాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు అర్థరహిత మాటలు వింటుంటే బహుశా ఆయనకు పిచ్చిపట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. విశాఖ మెంటల్‌ ఆస్పత్రిలో కూడా చంద్రబాబును జాయిన్‌ చేసుకోరేమో అని, ఆ విధంగా ఆయన చేష్టలు, వేషాలు ఉన్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: