రాజకీయంగా ఎవరిది పై చేయి అని ప్రశ్నించుకున్నపుడు చంద్రబాబునాయుడుపై ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డిదే పై చేయి అని అనుకోక తప్పదు. ఎందుకంటే ఉన్న 23 మంది ఎంఎల్ఏల్లో చంద్రబాబు ఇద్దరిని కోల్పోయినట్లే అనుకోవాలి. తాజాగా గుంటూరు పశ్చిమ ఎంఎల్ఏ మద్దాలి గిరి కూడా టిడిపిని వదిలేసినట్లే అని అర్ధమైపోతోంది. సోమవారం సాయంత్రం జగన్ తో ఎప్పుడైతే టిడిపి ఎంఎల్ఏ భేటి అయ్యారో అప్పుడే అర్ధమైపోయింది ఆయన పార్టీకి దూరమైపోయినట్లే అని.

 

ఇంతకుముందు గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీమోహన్ కూడా ఇదే విధంగా జగన్ ను కలిసిన తర్వాత పార్టీకి దూరమైపోయారు. అందుకనే వంశీ ఇపుడు అసెంబ్లీలో  స్వతంత్ర ఎంఎల్ఏగా కంటిన్యు అవుతున్నారు. నిజానికి ఎంఎల్ఏల ఫిరాయింపులనే రోగం మొదలైందే చంద్రబాబుతో. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 ఎంఎల్ఏలు,  3ఎంపిలను టిడిపిలోకి లాక్కున్నారు.  

 

విచిత్రమేమిటంటే వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలతో ఎటువంటి అవసరం లేకపోయినా జగన్ ను దెబ్బ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే అప్పట్లో చంద్రబాబు పావులు కదిపారు. పోనీ సక్సెస్ అయ్యారా అంటే అదీ లేదు. సరే ఎప్పుడూ సీన్ ఒకేలాగుండదు కదా ? సీన్ కట్ చేస్తే ఇపుడు జగన్ సిఎం అవ్వటంతో చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి. కాకపోతే  చంద్రబాబు చేసినట్లు ఎంఎల్ఏల ఫిరాయింపులకు జగన్ తెర ఎత్తలేదు. జగన్ ఆపని చేయాలని అనుకునుంటే ఈపాటికే టిడిపి ఎంఎల్ఏల్లో కనీసం 15 మంది వైసిపిలోకి వచ్చేసేవారే.

 

అందుకనే వ్యూహాత్మకంగా చంద్రబాబు కన్నును చంద్రబాబు వేలితోనే పొడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఇద్దరు టిడిపి ఎంఎల్ఏలు పార్టీకి దూరమయ్యారు. తొందరలోనే మరింతమంది బయటకు వచ్చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదికూడా చంద్రబాబును టైం చూసి మరీ దెబ్బకొడుతున్నారు. ఇసుక కొరత బాగా తీవ్రంగా ఉందంటూ చంద్రబాబు ఇసుక దీక్ష చేసిన రోజునే వంశీ పార్టీకి దూరమయ్యారు.

 

తాజాగా రాజధాని తరలింపు ఆందోళనలు జరుగుతున్న సమయంలో గిరి పార్టీకి దూరమయ్యారు. అంటే టిడిపి ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ఎంఎల్ఏలను లాగేయాలని అనుకున్నట్లున్నారు. చూద్దాం ముందుముందు ఇంకెతమంది బయటకు వచ్చేస్తారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: