సంక్రాంతి.. తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఇదే అతి పెద్ద పండుగ. ఉద్యోగాలు, ఉపాధి రీత్యా ఎక్కడ ఉన్నవారైనా ఈ పండుగకు సొంత గ్రామాలకు చేరుకుంటారు. పండుగ మూడు రోజులు ఉమ్మడి కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. అందుకే ఈ పండుగ కోసం డిసెంబర్ నుంచే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల బుకింగ్ లు, రైళ్ల టికెట్ బుకింగులు జోరందుకుంటాయి.

 

అయితే ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు ప్రయాణికులను దోచుకుంటుంటారు. పండుగను క్యాషే చేసుకుంటారు. అయితే ఈ సారి అలా జరగనివ్వం అంటున్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. పండుగల నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వాట్సాప్‌ నంబర్‌ 8309887955 ఫిర్యాదు చేయాలన్నారు. అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులు మన రాష్ట్ర బార్డర్‌లోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ప్రైవేట్‌ బస్సు యజమానులకు కూడా వినమ్రంగా తెలియజేస్తున్నామని..దయచేసి బస్సు ప్రయాణికులను దోపిడీ చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దూరప్రాంతాలకు నడిపే ఆర్టీసీ సర్వీసుల్లో ఎలాంటి చార్జీలు పెంచడం లేదన్నారు. పండుగ రద్దీ దృష్ట్యా సిటీ బస్సులు, అల్ట్రా బస్సులను వేరే ప్రాంతాలకు ఖాళీ బస్సులను నడిపి అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకురావాల్సి వస్తుంది. అందుకోసం 50 శాతం చార్జీలు పెంచుతున్నాం. ప్రయాణికులు అర్థం చేసుకోవాలన్నారు మంత్రి పేర్ని నాని.

 

మరి ఇంకేం. ఇక నుంచి ప్రైవేటు బస్సుల వారు ఎక్కువ సొమ్ము వసూలు చేసేందుకు ప్రయత్నిస్తే.. వాట్సాప్‌ నంబర్‌ 8309887955 ఫిర్యాదు చేయండి. అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులు మన రాష్ట్ర బార్డర్‌లోకి రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి చెబుతున్నారుగా. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ వదిలేయకుండా ఫిర్యాదు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: