ఏపీ సీఎం జగన్ మొండివాడన్న సంగతి తెలిసిందే. తాను అనుకున్నది చేయాల్సిందే. మాట ఇస్తే ఎలాంటి పనైనా జరిగిపోవాల్సిందే. లాభనష్టాలు, ముందూ వెనుకా అంటూ ఏమీ ఉండవు. ఈ సంగతి ఆర్టీసీ విషయంలో మరోసారి రుజువైంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వైయస్‌ జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారు జగన్. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సుదీర్ఘ కాల కోర్కేను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2020 జనవరి 1వ తేదీన నెరవేర్చబోతున్నారు.

 

ఆర్టీసీని విలీనంచేసిన సీఎం వైయస్‌ జగన్‌ గుండెధైర్యానికి నిజంగా జేజేలు పలకాల్సిన పరిస్థితి ఉంది.. గతంలో చంద్రబాబు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారు. మీ కోర్కెలకు అంతు లేకుండా పోయిందని మాట్లాడారు. తన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు విన్న వైయస్‌ జగన్‌..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని పరిరక్షించేందుకు ఉద్యోగులందరినీ కూడా మెర్జర్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

 

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల కలను సాకారం చేసే రోజు చరిత్రలో నిలిచిపోబోతోంది. జనవరి 1 నుంచి 50 వేల పైచిలుకు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మొదటి రోజు మొదలు కాబోతుంది. ఇందుకు జగన్ గుండె ధైర్యానికి జేజేలు పలకాల్సిందే అంటున్నారు మంత్రి పేర్ని నాని. 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్న ఆర్టీసీ కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆర్టీసీ విలీనంపై సీఎం వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకుని ప్రయత్నాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట కోసం, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా రూ.3600 కోట్ల జీత భత్యాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బుజానికి ఎత్తుకుంది. ఇలాంటి నిర్ణయం దేశ చరిత్రలో వైయస్‌ జగన్‌ ఒక్కరే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 

ఆర్టీసీ విలీనం సాధ్యంకాదని చాలా మంది నిపుణులు, మేధావులు అన్నప్పటికీ కూడా సీఎం వైయస్‌ జగన్‌ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లారు. 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు పాదాభివందనాలు చేస్తున్నాను.. అంటున్నారు మంత్రి పేర్ని నాని. మరి ఇదే సమయంలో ఇదే డిమాండ్ తో మొన్నటి వరకూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. కానీ అది సక్సస్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై ప్రేమ కురిపిస్తున్నారు. కానీ విలీనం డిమాండ్ మాత్రం నెరవేర్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: