అమ్మ.. ఈ పదానికి అర్థం ఆ భగవంతుడే చెప్పలేడు.. అందుకే సర్వావస్థలందు కంటికి రెప్పలా కాపాడే బాధ్యతలు తల్లికి అప్పగిస్తూ నవమోసాలు కని పెంచాలని అమ్మను సృష్టించాడు.  కవులు, పండితులు ఎవరు ఎన్ని చెప్పినా అమ్మ అనే పదానికి నిర్వచనమే చెప్పడం కష్టమే.  మనిషి పుట్టుకకు కారణం అయి.. అతని మడుగడకు ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ.. ఉన్నతమైన స్థితికి చేరుకునేలా చేస్తూ తన బిడ్డ ప్రపంచంలోనే గొప్పవాడు కావాలని అనుకుంటుంది తల్లి.  తాజాగా గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం రోడ్డు పైకి వస్తుంటాయి.  అదే సమయంలో వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. 

 

రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది.. అయితే తనకు తగిలిన దెబ్బ ఏమాత్రం లేక్క చేయకుండా  తన బిడ్డ ఆకలితో ఉండటం చూసి ఓ వైపు రక్తం కారుతున్నా.. ఏమాత్రం బాధ లేకుండా.. బిడ్డకు పాలు ఇస్తుంది.  ఈ దృష్యాన్ని ఓ ఔత్సాహికుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంట నీరు పెడుతున్నారు.. నిజంగా ఈ భూమిపై తల్లి ప్రేమ కంటే ఏది గొప్పది.. లక్షల కోట్లు ఇచ్చిన ఈ ప్రేమ దొరుకుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

 

మరికొంత మంది ఈ మద్య మానుషులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తున్నారని.. కానీ ఈ కోతి ఓ వైపు రక్తం కారుతున్న తన పాలు ఇచ్చి బిడ్డ ఆకలి తీరుస్తుంది... నిజంగా ఈ కోతి తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని కామెంట్స్ చేస్తున్నారు. మాతృత్వం పట్ల చూపించిన ప్రేమ అక్కడివారిని వారి మనసులను కదిలించే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: