ఆంధ్రరాష్ట్ర రాజధాని గురించి అనేక ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నయి. చంద్రబాబును చూసి పొలాలిచ్చిన రైతులు రోడ్ల మీదకు వచ్చారు. రాజధాని ఇక్కడే ఉంచాలని పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని దాదాపుగా ప్రకటించినా.. ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే.. సందట్లో సడేమియా అన్నట్టు టీడీపీ నాయకుల జోరు ఎక్కువైంది. రైతులకు సంఘీభావమే తెలుపుతున్నారో.. సమస్యను జటిలం చేస్తున్నారో అర్ధంకాని పరిస్థితి. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఈరోజు అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఈరోజు 24గంటల దీక్షకు దిగారు.

 

 

మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన 24 గంటల నిరాహారదీక్ష ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అమరావతి ప్రాంత రైతులతో కలిసి గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రివర్యులు దీక్ష చేస్తున్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అమరావతి రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కూడా చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు.  రాజధానిపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉమ చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. అమరావతి ప్రాంత రైతులే కాకుండా స్థానిక రైతులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.

 

 

ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని చెప్పటం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరిస్తున్నా టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కూడా ఇంతవరకూ రాలేదు. అయినా.. దేవినేని ఉమ ఇలా దీక్షలు చేయడం తగదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ మాత్రమే కాకుండా టీడీపీ నాయకులు కూడా రోజుకో వ్యాపకంతో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన రాకముందే ఇలా దీక్షలు చేస్తూ అలజడులు సృష్టించడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: