రాజధాని కేంద్రంగా గడచిన 15 రోజులుగా ఇంత రచ్చ జరుగుతున్నాఈ  కీలక నేత మాత్రం ఎక్కడా అడ్రస్ కనబడలేదే. ఇదే విషయాన్ని టిడిపి నేతలు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. బోగస్ సర్వేలతో  ఇటు తెలంగాణా అటు ఏపిలో  చంద్రబాబునాయుడుకు తలబొప్పి కట్టించిన లగడపాటి రాజగోపాల్  ఎక్కడున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి కేంద్రంగా ఓ సెక్షన్ జనాలు ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరూ  చూస్తున్నదే. నిజానికి జరుగుతున్న రచ్చ కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైనా రాష్ట్రమంతా అగ్నిగుండమైపోయిందని ప్రచారం చేస్తున్నారు.  స్ధానికుల ఆందోళనలకన్నా పెయిడ్ ఆర్టిస్టుల గోలే ఎక్కువగా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

 

సరే ఏ విధంగా జరుగుతున్నా, ఏమి జరుగుతున్నా కమ్మ సామాజికవర్గం కీలక నేతలు గుండెలు బాదుకుంటున్నది మాత్రం వాస్తవం. మరి ఇంత జరుగుతుంటే లగడపాటి మాత్రం ఎక్కడా కనడటం లేదు, వినబడటం లేదన్నదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే తన ముందు ఇంత గొడవ జరుగుతుంటే లగడపాటి చూస్తుండే రకం మాత్రం కాదన్న విషయం అందరికీ తెలుసు. జగన్ దెబ్బకు భయపడుతున్నారా అనే అనుమానం కూడా వస్తోంది. 

 

పైగా జగన్ ప్రతిపాదనతో కమ్మ సామాజికవర్గం ఆర్ధిక పునాదులే కదిలిపోతుందనే ఆందోళనే ప్రముఖుల్లో కనబడుతోంది. ఇదే విషయాన్ని ఏబిఎన్-ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలతో పాటు ఆ సెక్షన్ టివిలను చూస్తే అందరకీ అర్ధమైపోతుంది. ఇటువంటి నేపధ్యంలోనే ఇటు వ్యాపార అటు రాజకీయ రంగాల్లో కీలకమైన వ్యక్తి  కమ్మ సామాజికవర్గంలో కేంద్రబిందువుగా ఉండే లగడపాటి అడ్రస్ లేకపోవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

తన సహజ శైలిలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులపై ఇప్పటికే లగడపాటి సర్వేల పేరుతో బాగా హడావుడి చేస్తారని అందరూ భావించారు. మూడు రాజధానులపై సర్వే నిర్వహించి జగన్ ప్రకటనకు ఇన్ని లక్షలమంది వ్యతిరేకంగా ఉన్నారంటూ బాగా హడావుడి చేయకుండా లగడపాటి ఎందుకు మవునంగా ఉన్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: