మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు చాలా రోజుల నుండి అంటీముట్టనుట్లుగా ఉంటున్న విషయం తెలిసిందే. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందని బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టత ఇచ్చారు. 
 
గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు అండగా నిలవాలన్న చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించటాన్ని స్థానికుడిగా తాను స్వాగతిస్తానని గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. 
 
ప్రజల్లో అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని స్పష్టతనిచ్చారు. రాజధానిని మాత్రం స్వాగతిస్తున్నానని మిగతా విషయాల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటానని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల గురించి ప్రజలు గంటా శ్రీనివాసరావు ఇటు తెలుగుదేశం పార్టీకి అటు వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ అవ్వా కావాలని బువ్వా కావాలని అంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. 
 
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గంటా శ్రీనివాసరావు చెబుతున్నప్పటికీ వైసీపీ పార్టీలోకి చేరే ఆలోచన ఉంది కాబట్టే వైసీపీకి అనుకూలంగా గంటా వ్యాఖ్యలు చేస్తున్నాడని ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్లుగా టీడీపీ, వైసీపీ రెండూ కావాలనేలా గంటా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా గంటా వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఇటు వైసీపీ వర్గాలు గంటా చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: