హైదరాబాద్లోని షేక్ పెట్ నాల వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవటానికి  వచ్చినా స్కోడా  కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులో పెట్రోల్ పోసుకొంటున్న  సమయంలో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రాథమికంగా ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి పెట్రోల్ బంకు సిబ్బంది అందరూ పెట్రోల్ బంక్ నుండి పరుగులు పెట్టారు. క్రమక్రమంగా భారీగా నిప్పు కణికలు ఎగిసిపడుతూ భారీ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే పెట్రోల్ బంకు కూడా అంటుకున్నాయి  ఈ మంటలు. చూస్తుండగానే పెట్రోల్ బంక్ లో  పూర్తిగా స్కోడా కారు దగ్ధం అయిపోయి పెట్రోల్ బంక్ కూడా మంటలు అంటుకున్నాయి. 

 

 

 

 దీంతో పరిసర ప్రాంతాలన్నీ పొగమయంగా  మారిపోయాయి. అయితే పెట్రోల్ బంకు లోనే కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ భయాందోళనకు గురయ్యారు. బంకులో పూర్తిగా పెట్రోల్ డీజిల్ నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని  పెట్రోల్ బంక్ సమీపం నుండి పరుగులు తీశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతేకాకుండా సమీపంలోని షాపులన్నీ మూసివేసి నిర్వాహకులు బయటకు పరుగులు తీశారు. కాగా  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది బయలుదేరినట్లు సమాచారం. ఇకపోతే ఈ ఘటనలో పెట్రోల్ బంకు సిబ్బంది స్వల్ప గాయాలైనట్లు సమాచారం. 

 

 

 

 అయితే ఇలాంటి సంఘటనలు తరచూ ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల కంట్రోల్ చేసేంత మంటలు వ్యాపించిన్నప్పటికీ   కొన్ని చోట్ల మాత్రం ఇలా భారీగా మంటలు ఎగిసి పడి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం పెట్రోల్ బంకుకు  వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండక పోవడం అని తెలుస్తుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు  వెళ్ళినప్పుడు సెల్ఫోన్ మాట్లాడకూడదు.. ఇతర గ్యాస్ కి సంబంధించిన వస్తువులు వాడకూడదు... సిగరెట్ తాగ కూడదు... అన్న నిబంధనలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వీటిని పట్టించుకోకుండా అలాగే ప్రవర్తిస్తుండడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద యథేచ్ఛగా సెల్ ఫోన్లు మాట్లాడుతుండటం ... లేదా ఏసి ఆన్ చేసి ఉండడం లాంటివి చేస్తూ   నిర్లక్ష్యం వ్యవహరిస్తుండడటం  వల్ల పెట్రోల్ బంకులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి కూడా అలాంటి నిర్లక్ష్యమే కారణమని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: