మహారాష్ట్రలో ఎన్నో రాజకీయ సమీకరణాలు... ఎన్నో నాటకీయ పరిణామాలు... ఎన్నో ఎత్తులు పై ఎత్తుల తర్వాత చివరికి బిజెపి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోలేక కూలి పోయిన తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో  శివసేన పార్టీ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా శివసేన పార్టీకి చెందిన నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం గమనార్హం. ఇకపోతే తాజాగా సోమవారం నాడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఈ సందర్భంగా ఎన్సీపి నేత అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకరం చేయగా... మొత్తం మూడు పార్టీలకు సంబంధించి 36 మంది మంత్రులు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేశారు. 

 

 

 

 ఇకపోతే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గ విస్తరణ చేసిన కొన్ని గంటలకే ఎన్సీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం మహా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను రాజకీయాలకు పనికి రాని మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ప్రకటించారు. అంతే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి సంచలనం రేపారు. బీద్  జిల్లా మజల్ గావ్  నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఈ విషయాన్ని నిన్న రాత్రి వెల్లడించారు. మంగళవారం నేను రాజీనామా చేస్తున్నాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను అంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ప్రకటించారు. ఈ విషయాన్ని నేను ఎన్సీపీ నేతలకు కూడా తెలిపాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తానని ఎన్సీపీ  ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ప్రకటించడం మహారాష్ట్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. 

 

 

 

 ఇకపోతే మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కొన్ని గంటలకే ప్రకాష్ సోలంకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తో... ప్రకాష్ సోలంకి రాజీనామా చేయడానికి వెనుక ఉన్న కారణం మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం అంటూ చర్చించుకుంటున్నారు మహారాష్ట్ర ప్రజలు. అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కేబినెట్ లో స్థానం దక్కకపోవడం కి ఎలాంటి సంబంధం లేదు అంటూ ప్రకాష్ సోలంకి తెలిపారు. అయితే క్యాబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడు అని నిరూపించింది అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రకాష్ సోలంకి కేబినెట్లో చోటు దక్కకపోవడం వల్లే నిరాశ చెంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: