సినీ న‌టుడు, రాజ‌కీయ నాయకుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఓ రాజకీయ పార్టీకి అధినేత, సినీ హీరో అయినప్పటికీ.. ఆ ఆటిట్యూట్ ఎక్కడా చూపించరు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూశారు. కేవ‌లం ప్ర‌శ్నించ‌డానికికే పార్టీ పెట్టానంటూ... న్యాయాఅన్యాయాల పై అధికార పార్టీతో పోరాడుతుంటారు. ఇంతకాలం పార్టీ నిర్మాణం లేకుండా, పార్టీలో పూర్తిస్థాయి కమిటీలు లేకుండానే నడిపించారు. పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా కమిటీలు బలంగా లేకపోవడంతో ఎన్నికల్లో జనసేన ఓడిపోయింది. దీంతో పార్టీలో ముఖ్య కమిటీల మీద జనసేన చీఫ్ ఫోకస్ చేశారు. దీనిపై గత కొద్ది రోజులుగా సీనియర్ నాయకులతో చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అందులో వచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, విశ్లేషించి ఈ కమిటీలకు రూపమిచ్చారు. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఇదిలా ఉంటే...పార్టీ విష‌యంలో మొట్ట‌మొద‌టిసారిగా ఆయ‌న తిక‌మ‌క అయిన విష‌యాలు ఎన్నో ఉన్నా ప్ర‌ధానంగా ఓ మూడు విష‌యాల పై కాస్త చ‌ర్చించుకుంటే...

 


ఆయ‌న మొద‌టి సారి ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా వ‌ద్దా అని ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ప‌వ‌న్ ఏమీ తేల్చుకోలేక‌పోయారు. చివ‌ర‌కు సొంతంగా పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. చివ‌ర‌కు పార్టీ ఒక్క రాజోలు సీటుతో మాత్ర‌మే స‌రిపెట్టుకుంది.. అది కూడా ఆ ఎమ్మెల్యే ప‌వ‌న్ మాట విన‌డం లేదు కాబ‌ట్టి.

 

రెండ‌వ‌సారి ఏదైనా అంశం ఎత్తుకుని ఆవేశంగా జ‌నాల్లోకి వ‌చ్చి మాట్లాడ‌తారు. త‌ర్వాత దాని గురించి మ‌ర్చిపోతారు ఆ విష‌యం పై పెద్ద‌గా తిరిగి ప్ర‌క్షాళ‌న చేయ‌రు.  కాసేపు సినిమాలు అంటారు మ‌రి కాసేపు రాజ‌కీయాలు అంటారు నిల‌క‌డ లేని స్వ‌భావంతో కొంత తిక‌మ‌కనేది కామ‌న్‌గా ఏర్ప‌డింది.  రెండు ప‌డ‌వ‌ల మీద కాలు పెడ‌తారు అలాఅని ఏదీ క్లారిటీగా చేయ‌డంలేదు. ఇటు సినిమాలా లేదంటే రాజ‌కీయాలా అన్న‌ది స‌రిగా తేల్చుకోలేక తిక‌మ‌క‌ప‌డుతున్నార‌నే చెప్పాలి.

 

ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కూడా బాబులా క‌లిసిపోయాడ‌ని అంద‌రూ  భావిస్తున్నారు. ఆయ‌న బాబుకి బినామీలా త‌య్యార‌య్యాడ‌ని. ఆయ‌న ఏం చెపితే అదే మాట్లాడుతున్నాడ‌ని అలాంటి వాద‌న‌లు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి.  యూట‌ర్న్ బీజేపీ గొప్ప‌ది. అమిత్ షా గ్రేట్ అంటాడు.. ఎన్నిక‌ల‌కు ముందు ఎవ‌రిని తిట్టాడో మ‌ళ్లీ అదే బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్లాన్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: