తెలంగాణలో డి.ఎమ్.హెచ్.ఓల అవినీతి బండారం కలకలం రేపుతోంది. ఇప్పటికే మూడు జిల్లాల అధికారులపై వేటు పడగా.. ఈ జాబితాలో మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. త్వరలోనే ఆ అధికారులపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. 

 

జిల్లా మొత్తం మీద ఒకే పోస్ట్. అదే జిల్లా వైద్య అధికారి. మెడికల్ డిపార్ట్ మెంట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఇది.  డిమాండ్‌కు కారణం ఏంటో తెలుసా..?  ప్రోటోకాల్  కోసమో, పదవి కోసమో వచ్చిన డిమాండ్ కాదు.. ఎక్స్‌ట్రా ఇన్ కం  ఉన్న పోస్ట్ ఇది. అందుకే ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా... డి.ఎమ్.హెచ్.ఓగా  వెళ్ళాలనుకుంటారు. 

 

వాస్తవానికి సీనియర్ డాక్టర్లను డి.ఎమ్.హెచ్.ఓలుగా ప్రమోట్ చేస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసిన డాక్టర్లకు ప్రజలు సమస్యలు తెలిసి.. ప్రజలకు సరైన ఆరోగ్యం అందించేందుకు ప్రయత్నం చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. కానీ జిల్లా వైద్యాధికారుల తీరు మాత్రం మరోలా ఉంది. ప్రయివేట్ ఆస్పత్రుల నుంచి యధేచ్చగా డబ్బులు  వసూలు చేసుకుంటూ...అక్రమ సంపాదనలో మునిగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 

ఏ ప్రయివేట్ ఆస్పత్రికి అనుమతి ఇవ్వాలన్నా జిల్లా వైద్యాధికారి సంతకం చేయాలి. అప్లై చేసుకున్న మూడు నెలల్లో ఆకస్మిక తనిఖీ చేసి అన్ని సజావుగా ఉన్నాయో లేదో చూసి అనుమతి ఇవ్వాలి. దీన్నే ఛాన్స్‌గా తీసుకొని ఆస్పత్రుల నుంచి డీల్స్ మొదలు పెడతారు. ఒక్కో దానికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు కొందరు డి.ఎమ్.హెచ్.ఓలు. ప్రయివేట్ ఆస్పత్రులు మెడికల్ షాపులు, డయోగ్నోసిస్ సెంటర్లు ఇలా ఏవి నిబంధనల ప్రకారం ఉండవు. అయినా అనుమతులు ఇస్తారు. అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తారు. వైద్యం వికటించో.. అర్హత లేని వాళ్లు వైద్యం చేయటం వల్లో.. నిర్లక్ష్యం వల్లో ప్రాణాలు పోతే.. డి.ఎమ్.హెచ్.ఓ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పరిస్థితి లేదు. 

 

తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న అందరూ డి.ఎమ్.హెచ్.ఓలు అందరూ అవినీతికి పాల్పడక పోయినా, సగానికి పైగా అక్రమసంపాదనలో మునిగిపోయినవారే. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చేరడంతో... ఓ కన్నేసి ఉంచింది. డి.ఎమ్.హెచ్.ఓల  పనితీరుపై సీక్రెట్‌గా నివేదికలు తెప్పించుకుంది. త్వరలోనే అవినీతి అధికారులపై చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల డి.ఎమ్.హెచ్.ఓలపై వేటు పడింది. మరో పదిమంది పై కూడా వేటు వేసేందుకు సర్కార్ రంగం సిద్దం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: