ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం, చెప్పు చూపిస్తూ క‌ల‌క‌లం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నేత సుంకర పద్మశ్రీ తీరు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సుంకర పద్మశ్రీ... చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ చెప్పు చూపించి ఆయనను హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న అంబటి రాంబాబును ఆమె పిచ్చి కుక్కతో పోల్చారు. అయితే, కాంగ్రెస్ నేత సుంక‌ర ప‌ద్మ‌శ్రీ‌పై పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ దీటుగా స్పందించారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాల‌ని కోరారు.

 

తాజాగా పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్ గారిపై అవాకులు చెవాకులు పేలితే సహించం. జగన్ గారిని తిట్టడం వల్ల మైలేజ్ వస్తుందని భావిస్తున్నట్లు ఉన్నావు. మైలేజ్ సంగతి సరే నీలాంటి వారి వల్ల అసలే భూస్దాపితం అయి ఉన్న కాంగ్రెస్ పార్టీ పేరును ఉచ్చరించడానికే ప్రజలు అసహ్యించుకుంటారనేది గుర్తుంచుకో.` అని స్ప‌ష్టం చేశారు. ``మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేస్తున్న కృషిని దేశమంతా గుర్తించింది. పక్క రాష్ర్టంలో దిశపై అత్యాచారం,హత్య జరిగితే కేవలం రోజుల వ్యవధిలో దిశ చట్టం తీసుకువచ్చిన ఘనత జగన్‌ది. ఆ చట్టంపై దేశంలోని ఇతర రాష్ర్టాలు సైతం దృష్టి సారించి మార్గదర్శకంగా తీసుకుంటున్నాయి. ఎస్సి, ఎస్టి బిసి మైనారిటి మహిళలకు 50 శాతం నామినేటెడ్ వర్క్స్ లలో రిజర్వేషన్ కల్పించారు.మద్యంను దశలవారీగా నిషేదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళ ఉన్నతికి తోడ్పడుతున్న జగన్ గారిపై విమర్శలు మానుకోవాలని పద్మశ్రీ లాంటి వారికి హెచ్చరిస్తున్నాం.` అని స్ప‌ష్టం చేశారు.

 

``మాకు విలువలు,సంస్కారంతో వ్యవహరించమని జగన్ చెప్పారు కాబట్టి ఊరుకుంటున్నాం.లేకపోతే నీవద్దకే వచ్చి సమాధానం చెప్పేవాళ్లం. రాజధానిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు.రాజధాని సైతం తరలిపోవడం లేదు.లెజిస్లేజివ్ రాజధాని ఇక్కడే ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చాక  రైతులకు కౌలు చెల్లించారు. అబివృద్ది చేసిన ప్లాట్లు ఇస్తామని కూడా చెప్పారు. రైతులపేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసేవారు తమకు అన్యాయం జరుగుతుందని బావించి ఆయా గ్రామాల ప్రజలను మభ్య పుచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయ కుట్రలకు తెరతీశారు.ఇది చంద్రబాబు నీచ మనస్తత్వానికి నిదర్శనం. చంద్రబాబు హయాంలో పెందుర్తి,కుప్పంలలో మహిళలను వివస్ర్తలను చేసిన సంఘటనలు జరిగిన సమయంలోగాని వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి సందర్భంలోగాని సుంకరపద్మశ్రీ ఎక్కడకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ నోరెందుకు ఎత్తలేదు. ఈరోజు చంద్రబాబు ఆఢమన్నట్లుగా సుంకరపద్మశ్రీ లాంటి వారు ఆడుతున్నట్లుగా ఉంది.`` అని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: