న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరంలోకి ప్రపంచం మొత్తం అడుగుపెట్టబోతుంది. వివిధ దేశాలలో న్యూ ఇయర్ వేడుకలు ముందే అన్ని వచ్చేస్తాయి. దీంతో అంగ రంగ వైభవంగా ప్రతిచోటా న్యూఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం అయిపోయింది. ఇక నూతన సంవత్సర వేడుకలు అంటే ఎంజాయ్ మెంట్ కి ఎక్కడ డోకా  కూడా ఉండదు. అయితే న్యూ ఇయర్ వేడుకలను పలు దేశాలు భిన్నమైన సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ వేడుకలను భారతదేశంలో కంటే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా అంగరంగ వైభవంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుంటాయి. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలను జరుపుకుంటారు. 

 

 

 పాశ్చాత్య దేశాల్లో  అన్ని నగరాలు ఇప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రజలందరూ న్యూఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే న్యూ ఇయర్ వేడుకలను ఒక్కో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలను చాలా డిఫరెంట్ గా జరుపుతారు. న్యూ ఇయర్ వేడుకల అప్పుడు ఎక్కువగా తినాలి అనుకునేవారు ఈ దేశానికి వెళ్లాలి. వద్దు బాబోయ్ ఈ తిండి మాకొద్దు అనేంతలా తిండి పెట్టి మరి ఇబ్బంది పెడతారు. అది ఎక్కడ అనుకుంటున్నారా ఎస్టోనియా లో . నూతన సంవత్సర వేడుకల కోసం అది ఎక్కువ ఆహారం తీసుకోవాలనే సంప్రదాయాన్ని పాటిస్తారు ఇక్కడి ప్రజలు. 

 

 

 

 ఇది టాలిన్ యొక్క రాజధాని నగరం. చూడడానికి ఎంతో బ్రహ్మాండంగా కూడా ఉంటుంది. ఇక్కడ జరిగే నూతన సంవత్సర వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంగరంగ వైభవంగా ఆకాశాన్నంటేలా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటారు. అయితే నూతన సంవత్సర వేడుకలు సాంప్రదాయ పరంగా అదృష్ట సంఖ్యలో  భోజనం తినడం వల్ల మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎక్కువ భోజనాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏదో ఒకసారి లేదా రెండుసార్లు తినేసి బయటపడొచ్చు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ... ఎందుకంటే 7, 9 మరియు 12 సంఖ్యలను అదృష్ట సంఖ్యలు గా భావిస్తారు ఇక్కడి ప్రజలు. అందుకే 7,9 లేదా పన్నెండు సార్లు తినడం వల్ల కొత్త సంవత్సరంలో ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. అయితే మీరు మీ ప్లేట్  లో ప్రతిదీ పూర్తిగా తినవలసిన అవసరం లేదు కొంత ఆహారాన్ని వదిలి వేయడం వల్ల  పూర్వీకుల ఆత్మలు  సంతోషిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: