ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఇంగ్లీష్ మీడియం చేయాలని జగన్ ప్రకటించడంతో అప్పట్లో ఈ వార్త అనేక వివాదాలకు దారి తీసింది. విపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడాన్ని రక రకాలుగా విభజించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మతాలను మార్చాలని జగన్ ఆలోచిస్తున్నారని అనేక రీతులుగా జగన్ పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం పట్ల మండిపడ్డారు.

 

ఇదే రీతిలో తాజాగా ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కూడా జగన్ పై సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ నిర్ణయాలు తెలుగు భాషను చంపేస్తున్నాయి అంటూ మండిపడ్డారు. ఎవరో ఇజ్రాయిల్ నుండి జగన్ కి ఆదేశాలు ఇస్తున్నారని అందుకు అనుగుణంగా జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెడుతున్నారని చలసాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశారు.

 

ఇలాంటి నిర్ణయాల వల్ల భవిష్యత్తులో తెలుగు భాష చనిపోవటం గ్యారెంటీ అని సంస్కృతి మూలాలను మనమే చంపేసి కుంటున్నాం తెలుగు భాష పై ఎందుకు అంతా జగన్ కి కోపం అంటూ తీవ్ర స్థాయిలో చలసాని మండిపడ్డారు. మరోపక్క జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకురావడం పట్ల రాష్ట్రంలో ఉన్న పేద పిల్లల తల్లిదండ్రులు మా మీద భారం ముఖ్యమంత్రి జగన్ దించడం జరిగిందని మా పిల్లలు కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకునే స్థితికి జగన్ తీసుకెళ్తున్నారని జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: