సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటించేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తాను సూపర్ హీరో అన్నట్టుగా తెగ హడావుడి చేసేస్తున్నాడు. ప్రస్తుతానికి రాజకీయంగా తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న పవన్ వచ్చే ఎన్నికలనాటికైనా తాను సమర్థుడైన రాజకీయ నాయకుడిగా ప్రమోట్ చేసుకునేందుకు తాపత్రయపడుతున్నాడు. కానీ పవన్ చేస్తున్న విన్యాసాలు జనం ఎప్పటికప్పుడు గమనిస్తుండడంతో ఆయన్ను పెద్దగా పట్టించుకోవడమే మానేశారు. అయినా పవన్ ప్రజలకోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తిగా తనను తాను ప్రెజెంట్ చేసుకునేందుకు చూస్తున్నాడు. అందుకే వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నాడు. 


ఇప్పుడు రాజధాని అంశాన్ని రాజకీయంగా పవన్ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ రోజు అమరావతి పర్యటన చెప్పట్టాడు. ఈ సందర్భంగా అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ఈ అంశాన్ని మరింత రెచ్చగొట్టేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. పవన్ ఇంత అకస్మాత్తుగా అమరావతి పర్యటన పెట్టుకోవడం వెనుక ఆయన రాజకీయ గురువు చంద్రబాబు డైరెక్షన్ ఉంది అనేది అందరికి తెలిసిన బహిరంగా రహస్యం. టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడంతో పవన్ ను బాబు రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. 


రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జగన్ నిర్ణయానికి మద్దతు వస్తుండడంతో దాన్ని జీర్ణించుకోలేక, ఈ ఎత్తుగడ వేస్తున్నారని అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అయితే పవన్ ఇంతగా పెరఫామెన్స్ చేస్తున్నా ఆయనకు గాని ఆయన పార్టీకి కానీ పెద్దగా ఒరిగేది ఏమైనా ఉందా అంటే అది లేదు. పవన్ అమరావతి లో జరుగుతున్న ఆందోళన కు మద్దతు ప్రకటించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ మరింత బలహీనం అవుతుంది. ఈ విషయం పవన్ కి తెలిసినా చంద్రబాబు మెప్పు కోసం ఆయన అమరావతి పర్యటన చేప్పట్టి మరింత విమర్శలపాలవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: