కొత్త సంవత్సరం వేడుకలు అంటే సరదాగా కుటుంబ సభ్యులతో గానీ, లేదా స్నేహితులతో గాని ఎంజాయ్ చేయడం. అదీ కాకుంటే మద్యం తాగేవారు తాగుతుంటారు. ఆడే వారు ఆడుతుంటారు, గెంతేవారు గెంతుతుంటారు, పాడే వారు పాడుతుంటారు. అంటే ఎవరికి నచ్చిన రీతిలో ఆనందాన్ని వారు సొంతం చేసుకుంటారు. కొందరు తమకున్న పాత అలవాట్లకు స్వస్తి చెప్పి కొత్తగా మంచి పద్దతులు అలవరచుకుంటారు. మరికొంత మంది ఆలయాల్లో గడుపుతారు. కాని ఈ మద్యకాలంలో మంచి అలవాట్లకు స్వస్తి పలుకుతున్నారు.

 

 

డబ్బులు ఎంతగా ఖర్చు అయినా ఫర్వాలేదు. చెడు వ్యసనాలకు బానిసలుగా ఉంటాం అని అంటున్నారు. అంతే కాకుండా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మాదక ద్రవ్యాల పాత్ర కూడా పెద్దగానే ఉంది. ఇకపోతే ఇప్పుడు సరికొత్త సంప్రదాయానికి తెరతీసారు. అదేమంటే ఇది చాలదన్నట్లుగా కొత్త సంవత్సరానికి విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తూ స్వాగతం పలికేందుకు అనేక చోట్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందుకు గాను అమ్మాయిలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి న్యూ ఇయర్ వేడుకలను కాస్తా సెక్స్ పార్టీ సెలబ్రేషన్స్‌గా మార్చేస్తున్నారట.

 

 

ఇలాంటి దందా ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో వెలుగుచూసింది. ఆ వివరాలు తెలుసుకుంటే.. భోపాల్‌ లో ఏవైన అసాంఘిక కార్యకలాపాలు కొత్తసంవత్సరం సందర్భంగా జరుగుతాయనే అనుమానంతో  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన నగరంలోని అనేక రిసార్టులు, పబ్‌లు, క్లబ్‌లతో పాటు స్పా సెంటర్లలోనూ దాడులు నిర్వహించగా. షైన్ స్పా సెంటర్‌లో ఏడుగురు సెక్స్‌వర్కర్లు, ఆరుగురు విటులు దొరికారట, అంతే కాకుండా అక్కడ కొద్దిమొత్తంలో డ్రగ్స్ కూడా పట్టుబడటంతో పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే పట్టుబడిన వారిని భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇక స్పా సెంటర్లలో పట్టుబడిన వారందరినీ పునరావాస కేంద్రానికి తరలించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: