ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటేలా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయా దేశాలను ఆయా  సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటూ పాత సంవత్సరానికి గుడ్బై చెబుతూ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ కొత్త సంవత్సరం ఎన్నో విషయాలకు నాందిగా ఉంటుంది. చాలామంది ఏం చేయాలనుకున్నా కొత్త సంవత్సరం నుంచి ప్రారంభిస్తే శుభశకునం అని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది 2019లో చేసిన తప్పులు  కొత్త సంవత్సరంలో  2020లో చేయకూడదని సంకల్పంతో ఉంటారు. అంతేకాకుండా కొంతమంది మందుబాబులు ఇక వచ్చే సంవత్సరం నుంచి మందు ముట్టం  అని శపథాలులు సైతం చేస్తూ ఉంటారు. 

 

 

 ఇక కొత్త సంవత్సరం అంటే  అందరికీ సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్త సంవత్సరం ఒక శుభ దినం గా భావిస్తూ వుంటారు చాలామంది. అంతేకాకుండా కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్నో సెంటిమెంట్ లు   భావిస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇళ్లకు పునాదులు మొదలు పెట్టడం... కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడం. జీవితాన్ని మార్చే సరికొత్త నిర్ణయాలను తీసుకోవడం ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు జీవితం ఎలా ఉన్నా... కొత్తగా ప్రారంభించాలని భావిస్తూ వుంటారు చాలామంది. 

 

 

 

 కొత్త సంవత్సరం సందర్భంగా గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకునే వారి సంఖ్య మామూలుగా ఉండదు.చాలా మంది  కొత్త సంవత్సరం నాడు గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. ప్రియమైన వారికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తే కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించవచ్చు అని భావిస్తూ ఉంటారు. ఇకపోతే మన మందుబాబుల గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పని లేదు.  డిసెంబర్ 31 మందు మానేస్తా మని  శపథలు చేస్తూ ఉంటారు. జనవరి 1 నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెడు అలవాట్లు ఏమీ ఉండొద్దు  అని శపథాలు  చేసీ  ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఆ శపథలను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అన్ని మర్చిపోయి  యధావిధిగా అన్ని అలవాట్లు కంటిన్యూ చేస్తే.. కొంతమంది కొత్త సంవత్సరం నుంచి తమ లైఫ్ మార్చుకుంటారు. ఏదేమైనా అందరికీ కొత్త సంవత్సరం సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్.

మరింత సమాచారం తెలుసుకోండి: