కొత్త సంవత్సరం వేడుకల్లో అబ్బాయిలదే ఒకప్పుడు హావా ఉండేది.  అర్ధరాత్రి సమయంలో రోడ్డుమీదకు వెళ్లి హంగామా చేసేవారు.  డ్యాన్స్ లు చిందులు వేసేవారు.  పురుషాధిక్య ప్రపంచం అంటుంటారు.  అందుకే అప్పట్లో పురుషుల హవా కొనసాగింది.  కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది.  పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు.  ఇంకా చెప్పాలి అంటే పురుషుల కంటే మహిళలు ఒకాకు ఎక్కువే చదివారు.  

 


పురుషులతో పాటుగా ఆర్ధికంగా కూడా కూడా ఎదుగుతున్నారు.  పురుషులే కాదు ఇప్పుడు మహిళలు కూడా నైట్ పబ్ లకు వెళ్తున్నారు.  డ్యాన్స్ చేస్తున్నారు.  తాగుతుంటారు.  హంగామా చేస్తుంటారు.  ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి అనేలా అన్ని చేస్తుంటారు.  ఇలా చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.  అమ్మాయిలకు ఆర్ధిక స్వాతంత్రం రావడం.  హైటెక్ సిటీల్లో జాబ్ లు సంపాదించుకోవడంతో అన్ని రకాలుగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.  

 


ఇక ఇదిలా ఉంటె, కొత్త సంవత్సరంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు.  పబ్ లో డ్యాన్స్ చేస్తూ ఆనందంగా స్టెప్పులు వేస్తూ స్వాగతం పలుకుతుంటారు.  అంతేకాదు, కొత్త సంవత్సరం రాకతోప్రజల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి.  ఇప్పుడు ఈ సంస్కృతీ కేవలం నగరాలు, పట్టణాల్లోనే కాదు.. పల్లెటూరికి కూడా విస్తరించింది.  

 


పల్లెటూరిలో అయితే అమ్మాయిలు ఇంటిముందు న్యూఇయర్ ముగ్గులు వేస్తారు.  ఆ తరువాత కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా ఆహ్వానిస్తారు.  కేక్ కట్ చేసి... స్వీట్స్ పంచుకుంటూ.. శుభాకాంక్షలు చెప్పుకుంటారు.  ఇలా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ రాత్రి ఎంజాయ్ చేస్తారు.  ఆ తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లి నిద్రపోతారు.  అమ్మాయిలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్న తరువాత ఈ వేడుకలకు కల వచ్చింది.  కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: