రాజధాని అమరావతిని తరలించటానికి వీల్లేదంటూ డిమాండ్ చేస్తున్న చంద్రబాబునాయుడుకు రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాల రైతులు, రైతు కూలీలు పెద్ద షాకే ఇచ్చినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి గ్రామాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.  నిజానికి రాజధాని పరిధిలో మొత్తం 29 గ్రామాలున్నాయి.

 

అయితే ఇపుడు జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోంది కేవలం నాలుగు గ్రామాలకు చెందిన రైతులని మాత్రమే తెలుస్తోంది. మరి మిగిలిన గ్రామాల్లోని రైతులంతా ఏమి చేస్తున్నట్లు ? వాళ్ళెందుకు ఉద్యమాల్లో భాగస్వాములు కావటం లేదు ? ఎందుకంటే  మిగిలిన గ్రామాల్లోని రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములిచ్చినా ఇష్టపడి ఇవ్వలేదు. ప్రభుత్వమే చాలామంది నుండి బలవంతంగా వాళ్ళ నుండి భూములు లాక్కున్నది.

 

అదే సమయంలో పేరుకు రైతులే చాలామంది  భూముల్లో వ్యవసాయం చేస్తున్నది కౌలు రైతులే. ప్రభుత్వం భూములు లాగేసుకోవటంతో రైతు కూలీలకు కూడా చంద్రబాబు సరైన పరిహారం ఇవ్వలేదు. దాంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. ఇపుడు జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో చాలామంది రైతులు, కౌలురైతులతో పాటు రైతు కూలీల్లో సంతోషం కనబడుతోందట. తమ భూములు తమకు ఇచ్చేస్తే మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చని రైతులు, కౌలురైతులు, మళ్ళీ తమకు ఉపాధి దొరుకుతుందని రైతుకూలీలు హ్యాపీగా ఉన్నారట.

 

అందుకనే ఆందోళన చేస్తున్న వాళ్ళకు చాలామంది రైతులు, కౌలురైతులు,  రైతుకూలీలు మద్దతుగా నిలబడలేదట. ఈ విషయంలోనే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాలో బాగా కలవరం కనబడుతోందని సమాచారం. ఇపుడు ఆందోళన చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన రైతులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లే ఎక్కువమందున్నారట. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినా ఆందోళనల్లో ఊపు కనబడకపోవటానికి అసలు కారణం ఇదేనట. మొత్తానికి మెజారిటి రైతులు, కౌలురైతులు చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: