ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మిడ్ మానేరు ప్రాజెక్టు  అధికార పార్టీ  ప్రచార ఆర్భాటాలకు పరిమితం అవడంతో  మూడేళ్ళు ఆలస్యంగా నిర్మాణం జరిగిందని ధ్వజమెత్తారు. సాంకేతిక పరిజ్ఞానం లోపంతోనే కట్ట తెగిందని ఆయన విమర్శించారు. ఈ సందర్బంగా మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిడ్‌ మానేరు ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టని,  భిన్నాభిప్రాయాలు దీనిపై లేవని అన్నారు. వరద కాలువ ద్వారా ఎల్‌ఎమ్‌డీని నేరుగా నింపుకునే అవకాశం ఉండేదని ఆయన తెలిపారు.

 

సీఎం కేసీఆర్‌ 70 -80 లక్షల ఆయకట్టుకు  కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందుతుందని  చెప్పారు. అంత సాగవలంటే  800 టీఎంసీలు వాటి కోసం  కావాలని తెలిపారు. 18 లక్షల ఎకరాలకు ప్రస్తుత నీటితో  సాగు నీరందించవచ్చని అన్నారు. ఒక్క అదనపు ఎకరం ఆయకట్టు వినియోగంలోకి రాలేదని దుయ్యబట్టారు. ఎస్సీర్‌ఎస్పీ వరద నీటితో మిడ్ మానేరు నింపే అవకామున్న ఆ పని చేయలేదని విమర్శించారు.


రూ. 50 నుంచి 60 కోట్లు  ఎఎస్సార్‌ఎస్పీ నుంచి ఎల్‌ఎండీ నేరుగా నింపడానికి ఖర్చవుతుందని, ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ఇంతవరకు ఎవరు మానేరు, మూల వాగుల మీద చెక్ డ్యామ్‌ల నిర్మాణాన్ని వద్దనడం లేదని, ఇప్పటి వరకు అప్పర్ మానేరు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. 50 నుంచి 100 టీఎంసీలు  ఎల్లంపల్లి ఎగువన ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది గర్భంలో బ్యారేజీలు నిర్మిస్తే నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు.

 

   రూ. 2 లక్షల 40 కోట్ల అప్పు చేయడమా తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంటే అని ప్రశ్నించారు.  ప్రతి ఏటా కడెం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో అవుతుందని,  5 నుంచి 6 బ్యారేజీలు ఎల్లంపల్లి ఎగువన నిర్మించవచ్చని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేదని సీఎం విమర్శించడం సరి కాదని, ఎవరికీ విషయ పరిజ్ఞానం లేదో సీఎం అర్థం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు ఆనాడు గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించడానికి రిటైర్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావుతో చర్చించారని గుర్తు చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: