నూతన సంవత్సరానికి వెళ్ళే ప్రయాణికులకు విజ్ఞప్తి.ట్రైన్ నంబరు. 2020 న్యూఇయర్ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫాం నంబరు. డిసెంబరు 31   న 12.00.01 సెకండ్లకు పెద్ద ఎత్తున కూత పెట్టుకుంటూ బయలు దేరింది. 
జనవరి : 1-1-2020. 12.00.01.నిమిషాల నుండి పరవళ్లు త్రొకుతూ బయలు దేరి, 6 న ముక్కోటి( వైకుంఠ) ఏకాదశిని, తరవాత 14న, భోగిమంటలు వేసి,15.న మకరసంక్రాంతికి చెఱకు గడలును నములు కుంటూ, 16.న కనుమను, ఉత్తరాయణ పుణ్యకాలాని సంతరించుకొని 26 న గణతంత్ర  వేడుకలు ఘనంగా నిర్వహించి.

ఫిబ్రవరి : మీదుగావెళ్లుతూ,1 న,  రథసప్తమి రోజున తను చేయబోవు సాహసానికి తోడుగా వుండాలని సూర్య దేవుని దర్శంచుకుని, 14.న తనుప్రేమించి ప్రియురాలితో తన మనో భావాన్ని వ్యక్తపరిచి వివాహమాడి సతీ సమేతంగా, 21 న, శ్రీకాళహస్తి చేరుకుని మహశివరాత్రి కి జాగారం చేసి, అలా జారుకొని.

మార్చి : మీదుగా వచ్చి 9 న, హోళి పండుగలో రంగులు చల్లుకుని,16 న, పొట్టి శ్రీరాములు జయంతితో పాటు గా, 25న, మాత్రం సతీ సమేతంగా సొంత ఊరు చేరి బందువులతో కలిసి ఉగాది పచ్చళ్లను(శ్రీ శార్వరీ నామ సంవత్సరం) షాండ్రుచులను   ఆస్వాదించి, నూతనంగా స్వచ్చమైన తెలుగులో ధూమ శకఠం అనే పేరును నామకరణం చేసుకుని,

ఏప్రిల్ : 2 న, సతీ సమేతులై భద్రాచల శ్రీరామ నవమి కళ్యాణ మహోుత్సవంలో పాల్గోని,14 న,అంబేద్కరును పలకరించి, కొత్త శుక్రవారం రోజున తన భార్య చేత ముతైదులకు వాయనాలు అందించి.  ముతైదుల ఆశీస్సులు పొంది,
మే : 1 న, కార్మికులకు తన మద్దతునిచ్చి,10 న, తనకు ఞజన్మనిచ్చిన తల్లి వద్ద సతీ సమేతంగా పాదాభి వందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకుని, 17 న,హనుమంతుని దర్శించుకుని. 
జూన్ : 21 న,దంపత సమేతంగా తన తండ్రివద్దకు వెళ్లి ఆశీర్వాదాలు గైకొని విహరయాత్రకుగాను(ఖర్చులకు) డబ్బులు తీసుకొని.
జులై : 23న,బాలగంగాధర తిలక్,  జన్మదినోత్సవం. కేకును రుచి చూసి,తన తోటి చిన్న నాటి స్నేహితులతో కాసేపు సేద తీరి24న, సుబ్రమణ్యం స్వామికి కావడి ముడుపులు  చెల్లించి,25 న, తిరుమలలో గరుడ(పంచమి)సేవను తిలకించి
31 న,తన భార్య చేత వరలక్ష్మీ వ్రతం పూజాది కార్యక్రమాలు నిర్వత్తించి కథా సారాంశం విని,

ఆగస్ట్ :  3 న,తన సోదరి సోదరులకు రక్షాబంధన తోరణం కట్టి వారి వద్ద ఆశీర్వాదాలు పొంది, తను యఙ్ఞోపవీతం మార్చుకుని, 11న. శ్రీ కృష్ణునితో 
కలిసి దొంగిలించిన వెన్నను తిని, రంగులు చల్లుకొని ఉట్లును కొట్టి
 ,15 న, సంసిద్ధుడై స్వాతంత్ర సమరయోధులతో కలసి పోరాడి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టి, అటుపిమట, ,22న వినాయకుడికి పూజలు జరిపి ఉండ్రాలను, కుడుములను, ఆరగించి.
  
సెప్టెంబర్: 5 న,విద్యనేర్పిన గురువుకు పుణ్య జలంతో పాదాప్రక్షాలనం తో(కడిగి)గురువు ఆశీర్వాదాలు పొంది,
అక్టోబర్ : 2 న, గాంధీ పుట్టిన రోజున కేకును సమర్పించి, 17న
శ్రీ కనక దుర్గమ్మ శర్ననరాత్రి ఉత్సవాలకు దంపత సమేతంగా  
25నవిజయదశమి .శమీపూజ చేసుకుని
నవంబర్ : 1 న,మన  ఆంధ్ర ప్రదేశము ను ఎర్పాటు చేసుకుని, 13న,నరకాశురుడ్నీ చంపి,14న.దీపాలును వెలిగించి, 14 న,చాచ నెహ్రును పలకరించుకొని తన పిల్లలను నెహ్రువద్ద ఉన్నపిల్లలతోకలిపి ఆటపాటలతో గడిపి వారికి చాక్లేట్లు పంచి తామూ తిని,15 న, గోమాత సర్వజగ్ద్రక్ష,అంటూ నమస్కరించి,16న.కార్తీక స్నానమాచరించి,18 న, నాగులకు పాలు పొసి, 29నకార్తీక పూర్ణిమ  దీపం వెలిగించి
డిసెంబరు : ,25 న,క్రిస్మస్ తాత తోను,29 న దత్తాత్రేయ జయంతి.30న శివ ముక్కోటి చేరి దంపత సమేతంగా పుణ్యస్నానాదులాచరించి ఆ పార్వతి పరమేశ్వర్లను దర్శించుకొని ప్లాటుఫామ్ నెంబరు 31 కి చేరుకుని ప్రతీ 12:00:01 గంటలకు నూతనోత్సారాలకు తన జీవిత ప్రయాణం సాగిస్తూవుంటుంది.
ప్రయాణికులందరు గత స్మృతులను నెమరు వేసుకుంటూ సరి క్రొత్త లక్ష్యాలతో. మీ జీవిత ప్రయాణంలో భోగ భాగ్యాలను చవి చూస్తూ చేరుకోవాలని ఎపి హెరాల్డ్ ఫ్యామిలీ కోరుకుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: