చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ వేరు వేరునా ? అవును పవన్ కళ్యాణ్ జనసేనకు అధినేత... చంద్రబాబు తెలుగు దేశం పార్టీకి అధినేత. అయితే ఏంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసేది అంత ఒకటే.. ఒకటే మాట.. ఒకటే బాట. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకదా.. పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన పనులు చూస్తే ఎవరైనా సరే అదే అంటారు. 

                          

రాజధాని మార్పుపై ఈరోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నాలుగు రోజులు ముందు క్రిస్మస్ పండుగా సంబరాల కోసం అత్తగారి ఉరికి వెళ్ళొచ్చాడు. అప్పుడు కూడా ఇదే రాజధాని సమస్య కనిపిస్తుంది. రాజధాని రైతులు నడిరోడ్డుపై ధర్నాల మీద ధర్నాలు చేస్తున్నారు. అలాంటి ధర్నాలు చేసే సమయంలో ఈ జనసేనాని అత్తగారి ఇంట్లో ఉన్నారని.. సెలబ్రేషన్స్ అయ్యాక ఇప్పుడు తీరికగా అయన రాజధాని రైతుల కోసం సమయాన్ని కేటాయిస్తున్నట్టు నెటిజన్లు కూడా ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు. 

                                      

మరో వైపు అచ్చం చంద్రబాబులనే రాజధానిలో కామెడీలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుంది అని ఒకసారి అంటే.. మరోసారి అజ్ఞాతవాసి.. గంగతో రాంబాబు వంటి సినిమాలను డైరెక్ట్ గా చూపిస్తున్నాడు. కాల్చుకుంటే కాల్చుకోండి... అని పోలీసులకు ఎదురు వెళ్తున్నాడు ఈ సినిమా హీరో. 

 

అదేంటో పవన్ కళ్యాణ్ ఎన్ని చేసిన సరే.. సినిమాలో నటుడే కనిపిస్తున్నాడు కానీ నాయకుడు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా కామెడీలు చేశారు అని నెటిజన్లు సైతం నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: