జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని నెలకొల్పి ఇప్పటికే ఐదేళ్లు దాటుతోంది. అయితే అప్పట్లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, మొన్నటి 2019 ఎన్నికల్లో స్వయంగా ఎన్నికల బరిలో దిగారు. కాగా ఆయన పార్టీ కి కేవలం ఒక్కటంటే ఒక్కసీటు మాత్రమే లభించగా, తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇటీవల అత్యధిక మెజారిటీతో విజయఢంకా మ్రోగించిన వైసిపి పార్టీ తరపున అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన విషయం తెలిసిందే.

 

అయితే గతంలో తాను మద్దతిచ్చిన టిడిపి అధిష్టానం పై ఒక్క విమర్శ కూడా చేయని పవన్, ఇటీవల ముఖ్యమంత్రి అయిన జగన్ పై మాత్రం విమర్శలు చేయడం ఎక్కువయిందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.  
గతంలో బాబు ప్రభుత్వానికి మద్దతిచ్చిన పవన్, ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటూ రాష్ట్రాన్ని టిడిపి ఎంత భ్రష్టుపట్టిస్తున్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించరని, ఇక ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత చేపడుతున్న అభివౄద్ధి, సంక్షేమ పధకాలు చూసి ఓర్వలేకనే పవన్ ఆయనపై విమర్శలకు దిగుతున్నారని వారి అంటున్నారు. ఇక నేడు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై అమరావతిలో రైతులకు మద్దతుగా నిరసన చేపట్టిన పవన్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొంత వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ మొన్నటివరకు సింగపూర్ లో, 

 

ఇప్పుడే మంగళగిరిలో షూటింగ్ చేయడం చాలా బాగుందని ఎద్దేవా చేసారు. నిజానికి జగన్ గారు ఎక్కడా కూడా అమరావతిని రాజధానిగా తీసేస్తున్నాం అని ప్రకటించలేదని, అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమాన అభివృద్ధి అందాలి అనే దృక్పధంతోనే మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడం జరిగిందని అన్నారు. ఇక అమరావతిలో రైతుల భూములము ప్రభుత్వం ఎప్పడూ అండగా ఉంది వాటిని కాపాడుతుందని, కాబట్టి ఇకనైనా పవన్, తన షూటింగ్ ని పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన కోరారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: