ప్రస్తుతం మనిషి రోజురోజుకు డిజిటల్ గా ఎన్నో విధాలుగా ముందుకు సాగుతున్నాడు. ఇటీవల పలు విధాలైన మీడియా మాధ్యమాల రాకతో సమాచార ప్రసారం అత్యంత వేగవంతం అయింది. అయితే ఒకింత అదే పలు సమస్యలకు కూడా తావిస్తోంది. అటువంటి నూతన ఆవిష్కరణల వలన లాభం ఎంతైతే ఉంటుందో, అదేరీతిన నష్టం కూడా ఉంటోంది. కొందరు ఈ డిజిటల్ మాధ్యమాలను తప్పుడు పద్ధతులకు వాడి పలు వినాశనలకు పాల్పడుతున్నారు. ఇక మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, 

 

ఇటీవల కొద్దిరోజుల క్రితం ఇండియన్ నేవి విభాగంలో ముద్దగు జవానులు దేశభద్రతకు సంబందించిన కీలకమైన సమాచారాన్ని , మన బద్ద శత్రువైన పాక్ కు చేరవేసి హవాలాకు పాల్పడ్డారని వార్తలు బయటకు వచ్చాయి. కాగా ఆ వార్తలతో ఒక్కసారిగా భారతీయ ఇంటెలిజెన్స్ విభాగం అలెర్ట్ అవడంతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ఆ ముగ్గురు జవానులు ఎటువంటి సమాచారాన్ని లీక్ చేసారు అనే దానిపై విచారణ ప్రారంభించారు ఇంటెలీజెన్స్ అధికారులు. కాగా ఆ ముగ్గురు నేవి జవానులు విశాఖపట్నం హార్బర్ కు చెందిన వారుగా వార్తలు వస్తున్నాయి. అయితే వారిని వెంటనే విధుల నుండి తొలగించిన అధికారులు, ముగ్గురిని ప్రత్యేకంగా ఒక రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

 

అయితే ఆ ఘటనతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న భారతీయ నేవి విభాగం వారు, ఇకపై నేవి అధికారులెవారూ కూడా ఫేస్ బుక్ మాధ్యమాన్ని వినియోగించే వీలు లేకుండా అడ్డుకట్ట వేశారు. అలానే ఉద్యోగుల కదలికలు, పని తీరుపై పూర్తిగా నిఘా కూడా ఏర్పాటు చేసిన అధికారులు, ఇకపై ఎటువంటి పొరపాట్లు జరుగకుండా కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ముగ్గురు జవాన్లు లీక్ చేసిన సమాచారం ఫేస్ బుక్ ద్వారానే పాక్ కు చేరినట్లు విచారణలో తెలిసిందని, అందుకే ఆ విధంగా రహస్యాలను సులువుగా చేరవేసే వీలున్న ఫేస్ బుక్ ని ఇకపై అక్కడ బ్యాన్ చేసినట్లు చెప్తున్నారు.......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: