ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఏడు నెలల పాలనలో ప్రజలు లబ్ధి పొందే నిర్ణయాలను తీసుకుంటూ ప్రజాకర్షక పాలనను అందించారు. 2020 సంవత్సరంలో సీఎం జగన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నానని 2020 సంవత్సరం చరిత్రాత్మక సంవత్సరం కావాలని కోరుకుంటున్నానని నిన్న అధికారులతో చేసిన సమీక్షలో చెప్పారు. సీఎం జగన్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫించన్లను, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 
 
కలెక్టర్లంతా ఇళ్ల స్థలాల కోసం ఉధృతంగా పని చేయాలని ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన జగన్ జనవరి నెలంతా దిశ మాసం కొనసాగుతుందని, గ్రామ వార్డు సచివాలయాలలో స్పందన కార్యక్రమం అమలు చేయాలని సూచించారు. జనవరి 3వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

జనవరి 2వ తేదీన 46.50 లక్షల కర్షక కుటుంబాలకు రైతు భరోసా చివరి విడత సొమ్ము పంపిణీ చేయాలని ఖరీఫ్ నాటికి మరలా రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామని అన్నారు. జనవరి 2వ తేదీన అమ్మఒడి తుది జాబితా ప్రకటన వెలువడనుందని 2014 నుండి 2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఫిబ్రవరి 12వ తేదీన పరిహారం పంపిణీ చేయాలని సూచించారు. 
 
2019 జూన్ నుండి డిసెంబర్ మధ్య బలవన్మరణానికి పాల్పడిన రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయల పరిహారం స్వయంగా కలెక్టర్లే రైతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి అందజేయాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు కట్టించి ఇస్తామని జగన్ అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు దిశ చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయబోతున్నట్టు జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: