కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసేందుకు ఏర్పాటైన తెలుగుదేశం పార్టీలో...విజ‌య‌వంతంగా మూడో త‌రం వార‌స‌త్వం రాజ‌కీయం ఏలుతున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో... ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుటుంబం మ‌రోమారు వార్త‌ల్లోకి ఎక్కింది. మునుపెన్న‌డూ లేని రీతిలో త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిని రంగంలోకి దింప‌డం. అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించిన చంద్ర‌బాబు ఈ సారి తనతో పాటుగా సతీమణి భువనేశ్వరిని సైతం తీసుకెళ్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు దానికి కొనసాగింపుగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణ‌యంపై ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

రాజధాని అమ‌రావ‌తి త‌ర‌లిపోతోందంటూ.... ఆ ప‌రిధిలోని గ్రామాల్లో రైతుల కుటుంబాలు ఆందోళ‌న చేస్తున్నాయి. దీంతో కొత్త సంవత్సరం ఆరంభం రోజున వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు..కేడర్ కు సైతం అదే సూచించారు. మ‌రోవైపు ఆందోళ‌న‌ల్లో మహిళలు సైతం పాల్గొంటుండ‌టంతో వారికి మద్దతుగా భువనేశ్వరిని తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారని అంటున్నారు. అయితే, మొట్ట‌మొద‌టి సారిగా ఓ ఆందోళ‌న‌కు చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణిని తీసుకువెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అందులోనూ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌రుగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 

 

వాస్త‌వానికి రాజ‌ధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉంద‌నే ప్ర‌చారం ఉంది. అయిన‌ప్ప‌టికీ... ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ సిట్టింగ్ మంత్రి హోదాలో అక్క‌డ పోటీ చేసిన‌ప్ప‌టికీ ఓట‌మి పాల‌య్యారు. అలాంటి త‌రుణంలో...అక్క‌డ లోకేష్‌తో కాకుండా త‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌డం ఆస‌క్తిక‌రం. మ‌రోవైపు లోకేష్ కోసం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి పాల్గొన్నారు.  అయితే, రాజధాని గ్రామాల్లో రైతుల కుటుంబాలకు చెందిన మహిళ లు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నప్ప‌టికీ ఆమె మ‌హిళ‌ల ఆందోళ‌న‌కు సంఘీభావం ఎందుకు తెల‌ప‌డం లేద‌న్న‌ది ఇంకో ప్ర‌శ్న‌. ఈ ప్రాంత ప్ర‌జ‌ల కోసం త‌మ ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌న్న పేర్కొన్న లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి ...అక్కడికి వెళ్లి మ‌ద్ద‌తు ఇవ్వొద్ద‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారా?  లేదంటే...బ్రాహ్మ‌ణిని పిల‌వ‌డం స‌రికాద‌ని చంద్ర‌బాబు అనుకున్నారా?  ఆహ్వానించినా...ఆమె వెళ్ల‌డం లేదా? ఇవ‌న్నీ....తాజాగా చంద్ర‌బాబు సతీమణి భువనేశ్వరి టూర్ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్న ప్ర‌శ్న‌లు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: